twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్‌ను కుదిపేసిన చిరు, ప్రభాస్, విజయ్.. కలెక్షన్లతో ఇరుగదీశారు..

    By Rajababu
    |

    తెలుగు, తమిళ పరిశ్రమలకు బాగా 2017 సంవత్సరం కలిసి వచ్చింది. ఈ ఏడాదిలో పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పలువురు హీరోలు కలెక్షన్ల వర్షం కురిపించారు. ఏడాది ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవి, మధ్యలో బాహుబలి చిత్రంతో ఎస్ఎస్ రాజమౌళి, ముగింపులో మెర్సల్‌తో విజయ్ హంగామా చేశారు. ఈ చిత్రాలే కాకుండా అంచనాలు లేకుండా వచ్చిన పలు చిత్రాలు వసూళ్ల సునామీని సృష్టించాయి. అలాంటి సంచలన చిత్రాలపై ఓ లుక్కేద్దాం.

    చిరంజీవి రీ ఎంట్రీ

    చిరంజీవి రీ ఎంట్రీ

    తమిళ నటుడు, ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ వచ్చిన కత్తి చిత్రం తెలుగులోకి ఖైదీ నంబర్ 150 చిత్రంగా రీమేక్ అయింది. మెగాస్టార్ చిరంజీవి 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగులో రీఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 103.8 కోట్ల నికర వసూళ్లను సాధించింది.

     ఖైదీనంబర్ 150కి భారీ లాభాలు

    ఖైదీనంబర్ 150కి భారీ లాభాలు

    ఖైదీ నంబర్ 150 చిత్ర లాభాలను రాంచరణ్ 50 శాతం లాభాలను, దర్శకుడు వినాయక్ పంపిణీదారుడిగా 19 శాతం లాభాలను పంచుకొన్నట్టు ట్రేడ్ అనలిస్టుల సమాచారం. ఈ చిత్రం చిరంజీవిని మళ్లీ అగ్రపీఠంపై నిలబెట్టింది.

     చిరంజీవి మెగా రికార్డు

    చిరంజీవి మెగా రికార్డు

    బాహుబలి 1 చిత్రం ఆరు రోజుల్లో 100 కోట్లు సాధిస్తే.. ఆ చిత్రం తర్వాత వేగంగా వందకోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా ఖైదీ నంబర్ 150 చిత్రం ఓ రికార్డును సొంతం చేసుకొన్నది.

     రికార్డుల బాహుబలి

    రికార్డుల బాహుబలి

    2017 సంవత్సరంలో భారతీయ సినిమా చరిత్రను తిరగరాసిన చిత్రం బాహుబలి. స్వదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం వసూళ్ల సునామీని సృష్టించింది. సుమారు రూ.1705 కోట్ల వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది.

     జపాన్‌లో సునామీకి రెడీ

    జపాన్‌లో సునామీకి రెడీ

    గత కలెక్షన్లతో ఆగకుండా మరోసారి బాహుబలి చరిత్ర సృష్టించడానికి సిద్దమవుతున్నది. ఈ చిత్రం డిసెంబర్ 29న జపాన్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. జపాన్‌లో భారీ వసూళ్లను సాధిస్తే ఈ చిత్రం 2 వేల కోట్ల క్లబ్‌లో చేరడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అమీర్‌ఖాన్ చిత్రం దంగల్ 2వేల కోట్ల వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే.

     మెర్సల్ హవా

    మెర్సల్ హవా

    తమిళ నటుడు విజయ్ మెర్సల్ చిత్రం తన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా తమిళ భాషలో అత్యధిక వసూళ్లను సాధించిన తమిళ సినిమాగా ఓ రికార్డు సొంతం చేసుకొన్నది.

     విజయ్ రికార్డు కలెక్షన్లు

    విజయ్ రికార్డు కలెక్షన్లు

    మెడికల్ మాఫియాపై రూపొందిన మెర్సల్ చిత్రం గత 50వ రోజుల్లో ప్రపంచవ్యాపంగా రూ. 254 కోట్ల రూపాయలను వసూలు చేసింది. రజనీకాంత్ నటించిన కబాలీ, రోబో చిత్రాల తర్వాత మూడోస్థానంలో మెర్సల్ నిలవడం విశేషం. కేవలం తమిళనాడులోనే ఈ చిత్రం 128 కోట్లు వసూలు చేయడం గమనార్హం.

     అర్జున్ రెడ్డి సంచలనం

    అర్జున్ రెడ్డి సంచలనం

    సందీప్‌రెడ్డి వంగ దరకత్వంలో, విజయ్ దేవరకొండ, షాలిని పాండే నటించిన అర్జున్ రెడ్డి సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 50 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం థియట్రికల్ హక్కులే రూ.6 కోట్లకు అమ్ముడుపోవడం సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది.

     విక్రమే వేద సూపర్ హిట్

    విక్రమే వేద సూపర్ హిట్

    పుష్కర్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ వేద చిత్రం అనూహ్యమైన విజయం సాధించింది. విజయ్ సేతుపతి, మాధవన్ నటించిన ఈ చిత్రం రూ.50 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తమిళనాడులోనే రూ.50 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ 15.8 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం.

    English summary
    2017 was a fantastic year for Tamil and Telugu film industries in terms of box office. The year witnessed three all-time industry hits with SS Rajamouli’s Baahubali 2 in Tollywood and Thalapathy Vijay’s Mersal in Kollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X