»   » మనోజ్ గాడి విజయ గాథలో పిట్ట కొంచెం కూత ఘనం: షీనా

మనోజ్ గాడి విజయ గాథలో పిట్ట కొంచెం కూత ఘనం: షీనా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదల అయిన హీరో మనోజ్ గాడి విజయ గాధ ప్రేక్షకులకు ఫరవాలేదనిపించినది. దర్శకుడు వీరు పోట్ల కథను మలిచిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. విజయం కోసం మొహం వాచి పోయిన మనోజ్ ఖతాలో ఒకటి నమోదయ్యే అవకాశం ఉంది. మరి అతని ప్రక్కన నటించిన కథానాయిక షీనా అందచందాలు చిత్రానికి అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు అయితే..

బిందాస్ సినిమాతో పరిచయమైన షీనా సహబది అసలు వయసెంతో కానీ చూడ్డానికి మాత్రం చాలా చిన్నపిల్లలా ఉందని 'బిందాస్" చూసినవారంతా అంటున్నారు. మరీ స్కూల్ కిడ్ లా ఉన్నా షీనా హీరోయిన్ పాత్రలో చాలా ఆడ్ గా అనిపించిందని, ఆమె ఎక్స్ ఫోజింగ్ చేస్తూ అందాలను అలా ప్రదర్శస్తోంటే ఎబ్బెట్టుగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. టీనేజ్ హీరోయిన్స్ ఇప్పుడు చాలా మందే చలామణిలో ఉన్నా వారితో పోలిస్తే షీనా మరీ చిన్నపిల్లలా కనిపిస్తోందని, ఆమె మరికొంత కాలం ఆగి పరిచయమై ఉంటే బాగుండేదని అనుకుంటున్నారు. ఈ నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని తట్టుకుని 'బిందాస్" బేబీ ఎన్ని సినిమాలు చేజిక్కించుకుంటోదో చూడాలి.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu