»   » 14 ఏండ్ల తర్వాత సల్మాన్‌తో.. బ్లాక్ బ్యూటీ వరల్డ్ టూర్.. ఓన్లీ ఫ్రెండ్‌షిప్

14 ఏండ్ల తర్వాత సల్మాన్‌తో.. బ్లాక్ బ్యూటీ వరల్డ్ టూర్.. ఓన్లీ ఫ్రెండ్‌షిప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెండ్లి తర్వాత కొత్త జీవితం, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించి వచ్చిన బాలీవుడ్ స్టార్ బిపాసా బసు ప్రస్తుతం జాలీ మూడ్ నుంచి వర్క్‌పై దృష్టిపెట్టింది. పలు యాడ్స్‌లో నటించేందుకు అంగీకారం తెలిపింది. ఇవన్నీ కాకుండా ఈ ఏడాది ఏప్రిల్, మేలో సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌తో కలిసి ద-బ్యాంగ్ (దబాంగ్) వరల్డ్ టూర్‌ 2017కు వెళ్లనున్నది. పలు దేశాల్లో లైవ్ కార్యక్రమాలలో పాల్గొననున్నది.

2003లో కూడా సల్మాన్‌తో కలిసి

2003లో కూడా సల్మాన్‌తో కలిసి

సల్మాన్ ఖాన్‌తో కలిసి వరల్డ్ టూర్ చేయడం బిపాసకు తొలిసారి కాదు. అయినా మళ్లీ సల్మాన్‌తో జత కట్టడంపై ఎగిరి గంతేస్తున్నది. ‘14 ఏండ్ల తర్వాత మళ్లీ సల్మాన్‌ బృందంలో పాల్గొనడం ఎక్సైటింగ్‌గా ఉంది. 2003లో తొలిసారి సల్మాన్‌తో కలిసి వరల్డ్ టూర్ వెళ్లినట్టు గుర్తింది' అని బిపాస వెల్లడించింది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పలుదేశాల్లో లైవ్ కార్యక్రమాలు

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పలుదేశాల్లో లైవ్ కార్యక్రమాలు

నా కెరీర్‌ను మలుపుతిప్పేంతగా ప్రభావం చూపింది ద-బ్యాంగ్ లైవ్ మ్యూజికల్ ప్రొగ్సాం. ఈసారి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనే కాకుండా మలేషియా, హంకాంగ్‌లో కూడా సంగీత కార్యక్రమాలను నిర్వహించనున్నాం అని బిపాస చెప్పింది.

హిట్ సాంగ్స్‌కు స్టెప్పులు.. అక్కడే చూడండి..

హిట్ సాంగ్స్‌కు స్టెప్పులు.. అక్కడే చూడండి..

ఈ టూర్‌లో గత 15 ఏండ్ల నా కెరీర్లో హిట్‌గా నిలిచిన పాటలకు అనుగుణంగా స్టెప్పులు వేయనున్నాను. ఇంకా ఈ షోలలో ఏమి చేస్తామని చెప్పడం కుదరదు. ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించేది లైవ్‌లోనే చూడాలి అని ఆమె తెలిపారు.

సల్మాన్ ఖాన్ గుడ్ ఫ్రెండ్

సల్మాన్ ఖాన్ గుడ్ ఫ్రెండ్

‘చాలా కాలం నుంచి సల్మాన్, తాను మంచి స్నేహితులం. ఇటీవల సల్మాన్ బర్త్‌డేకు కూడా హాజరయ్యాను. ఎక్కువగా ఫోన్‌లో టచ్‌లో ఉంటాం. ఆయన‌తో మంచి సంబంధాలున్నాయి' అని బిపాసాబసు వెల్లడించింది.

English summary
Bipasa Basu will be joining the superstar Salman Khan for a world tour. She said “I’m excited because I am teaming up with him once again for a concert like this after a gap of nearly 14 years.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu