»   » బాలకృష్ణ సినిమాలో మహేష్ హీరోయిన్ ఐటం సాంగ్!

బాలకృష్ణ సినిమాలో మహేష్ హీరోయిన్ ఐటం సాంగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ భామ బిపాసా బసు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ బిజియోస్ట్, సెక్సీయోస్ట్ హీరోయిన్ అయిన బిపాసా చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతోంది. బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న 'లెజెండ్' చిత్రం ఐటం సాంగు చేయబోతోంది. గతంలో బిపాసా మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన టక్కరి దొంగలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

టక్కరి దొంగ చిత్రం తర్వాత బిపాసా మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. దాదాపు 12 ఏళ్ల తర్వాత అమ్మడు టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్య, బిపాసాలపై మసాలా ఎలిమెంట్స్‌తో మాస్ ఐటం సాంగును ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి బిపాసాతో కలిసి బాలయ్య థియేటర్లను ఏ రేంజిలో షేక్ చేస్తాడో చూడాలి.

 Bipasha Basu item number in Balakrishna's Legend

రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్‌సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈచిత్రంలో బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతి బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారు.

ఆడియో‌ని మార్చి 7 న విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు ఫిక్స్ అయినట్లు సమాచారం. ఫస్ట్ టీజర్ ని కూడా అతి త్వరలో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 28న గానీ, లేదంటే ఏప్రిల్‌ 4న గానీ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. మరో వైపు ఈ చిత్రం బడ్జెట్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. దాదాపు నలభై కోట్ల వరకూ ఈ చిత్రంపై పెట్టుబడి పెడుతున్నట్లు సినీ వర్గాల సమాచారం.

English summary
Film Nagar source said that, Bollywood beauty Bipasha Basu is going to shake her leg with Nandamuri Balakrishna in 'Legend'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu