»   » రాణా, నేను కలిసి సరదాగా గడిపిన క్షరాణాలు చాలా ఉన్నాయి

రాణా, నేను కలిసి సరదాగా గడిపిన క్షరాణాలు చాలా ఉన్నాయి

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాణా, నేను కలిసి సరదాగా గడిపిన క్షరాణాలు చాలా ఉన్నాయి. రాణా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే..అతనిది ఆకట్టుకొనే రూపమొకటే కాదు.. అతనిలో మంచి నటుడు కూడా ఉన్నాడు. మొదట్లో రాణా ఫొటో చూడటం తప్ప.. తనెవరో నాకు తెలియదు. సెట్‌కి వెళ్లాక తనతో స్నేహం ఏర్పడింది అంటూ రాణా గురించి మైమరిచిపోతూ చెప్తోంది బిపాసా బసు.దమ్ మారో దమ్ చిత్రంలో రాణా సరసన ఆమె నటించింది. ఆ చిత్రం ప్రమేషన్ లో భాగంగా తనను కలిసిన మీడియాతో ఇలా స్పందించింది. అలాగే రాణా హిందీ కూడా చక్కగా మాట్లాడతాడు. సినిమాలో నా సంభాషణలు కూడా గుర్తుపెట్టుకోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది అంది.

ఇక 2001లో మహేష్‌ బాబు సరసన 'టక్కరిదొంగ' సినిమాలో నటించా. తెలుగులో మళ్లీ నటిస్తారా అని ఇప్పుడు అడుగుతున్నారు. తెలుగు భాష కష్టంగా అనిపిస్తుంటుంది. నాకు కొన్ని తెలుగు పదాలు వచ్చు. అవన్నీ రాణాయే నేర్పాడు. రాణాతో కలిసి నటించమంటే నేను రెడీ. భాష విషయంలో తననుంచి ఎంతైనా సహాయం తీసుకోవచ్చు. నాకు నేను బాగా ఇష్టపడి చేసిన చిత్రమిది. ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వాటిని అందుకోగలం. తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకముంది అంటూ బిపాసా 'దమ్‌ మారో దమ్‌'చిత్రం గురించి చెపుతూ రాణా గురించి ప్రస్దావించింది.

English summary
'Dum Maaro Dum' is an upcoming thriller directed by Rohan Sippy and stars Abhishek Bachchan, Rana Daggubati, Bipasha Basu and Prateik Babbar.The film is set for an April 22, 2011 release date.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu