twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మానందంపై కన్నేసిన బిత్తిరి సత్తి.. టార్గెట్ చేస్తూ! ఆ ముగ్గురినీ వదల్లేదు

    |

    బుల్లితెర ప్రేక్షకులకు బాగా సుపరిచితం బిత్తిరి సత్తి. వచ్చి రాని పదజాలంతో నవ్విస్తూనే లేటెస్ట్ సమాచారం చేరవేయడం ఈయన ప్రత్యేకత. వార్తలు ఇలా చెప్పొచ్చు అంటూ ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఈ బిత్తిరి సత్తి.. ఏకంగా టాలీవుడ్ బడా కమెడియన్ బ్రహ్మానందాన్నే టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ బ్రహ్మానందంపై బిత్తిరి సత్తి కన్ను ఎందుకు పడింది? వివరాల్లోకి పోతే..

     అలా అలా తిరిగి బిత్తిరి సత్తి వద్దకు

    అలా అలా తిరిగి బిత్తిరి సత్తి వద్దకు

    ప్రస్తుతం నెట్టింట 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' హవా నడుస్తోంది. పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటాలనే సదుద్దేశంతో నడుస్తున్న ఈ ఛాలెంజ్‌ని పలువురు సెలబ్రిటీలు సాదరంగా స్వాగతిస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ రోజు రోజుకూ విస్తరిస్తూ చివరకు బిత్తిరి సత్తి వద్దకు చేరింది.

     బ్రహ్మానందంకు బిత్తిరి సత్తి సవాల్

    బ్రహ్మానందంకు బిత్తిరి సత్తి సవాల్

    ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఛాలెంజ్‌లో భాగంగా ఇప్పటికే ఎంతోమంది సినీ, రాజకీయ, ప్రముఖులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బిత్తిరి సత్తికి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. దీంతో ఆ ఛాలెంజ్ స్వీకరించిన సత్తి మూడు మొక్కలు నాటి తన పని పూర్తి చేశాడు. ఈ మేరకు టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందంకు తన సవాల్ విసిరాడు బిత్తిరి సత్తి.

    బ్రహ్మానందంను కలసి మరీ..

    బ్రహ్మానందంను కలసి మరీ..

    ఈ సందర్బంగా బ్రహ్మానందంను కలసి ఓ మొక్కను అందజేశాడు సత్తి. ఈ సందర్భంగా బ్రహ్మానందంతో కలిసి ఫొటోలకు పోజిచ్చాడు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం నియంత్రణకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుత అస్త్రమని ఈ సందర్బంగా బిత్తిరి సత్తి పేర్కొన్నాడు.

    Recommended Video

    #CineBox : RRR Update : Olivia Morris Pairup With Jr. NTR In RRR Movie !
    ఆ ముగ్గురినీ వదలని సత్తి

    ఆ ముగ్గురినీ వదలని సత్తి

    హాస్య నటుడు బ్రహ్మానందంతో పాటు కేసీఆర్ మనవడు కల్వకుంట్ల హిమాన్షురావు, ప్రియదర్శి, బిగ్ బాస్ ఫేం శివజ్యోతికి మొక్కలు నాటాలని సవాల్ చేశాడు బిత్తిరి సత్తి. రోజు రోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని అన్నారు బిత్తిరి సత్తి. అంతేకాదు వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నాడు.

    English summary
    Bittiri Satti participated in Green India Challenge. After she forwarded her challenge to Brahmanandam and Shiva Jyothi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X