»   » సినీ హీరో శివాజీపై దాడికి యత్నం.. చేసింది ఎవరంటే?

సినీ హీరో శివాజీపై దాడికి యత్నం.. చేసింది ఎవరంటే?

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  తెలుగు సినీ నటుడు శివాజీకి చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై బీజేపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించడం సంచలనం రేపింది. ఏపీలో ఇలాంటి దాడులు ఇంతకు ముందు జరుగకపోవడం, ప్రత్యేక హోదాపై ఉద్యమిస్తున్న నేతపై దాడికి ప్రయత్నించడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. గత కొద్దికాలంగా ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందని శివాజీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

  శివాజీపై బీజేపీ కార్యకర్తల వాగ్వాదం

  శివాజీపై బీజేపీ కార్యకర్తల వాగ్వాదం

  బుధవారం ఉదయం నటుడు శివాజీ విమానంలో విజయవాడకు చేరుకొన్నారు. గన్నవరం విమానాశ్రయంలో శివాజీకి బీజేపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఆయనతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఆగ్రహం చెందిన కార్యకర్తలు శివాజీపై దాడికి ప్రయత్నించారు.

  కన్నా సమక్షంలోనే

  కన్నా సమక్షంలోనే

  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కన్నా లక్ష్మీనారాయణ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకొన్న సందర్భంగానే శివాజీపై దాడి ఘటన చోటుచేసుకొన్నది. కన్నాను ఆహ్వానించేందుకు వచ్చిన కార్యకర్తలు శివాజీపై దాడికి యత్నం చేశారు.

  మోదీని తిడుతావా?

  మోదీని తిడుతావా?

  ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై మండిపడుతున్న శివాజీపై దూషించారు. నోటికి వచ్చినట్టు తిట్టడం కాదని బెదిరించారు. కొంత మంది కార్యకర్తలు శివాజీపైకి దూసుకెళ్లారు. ఆ సమయంలో కొంత మంది ఆయనపై దాడికి యత్నించారు. దీంతో విమానాశ్రయంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సకాలంలో రంగ ప్రవేశం చేసి శివాజీకి రక్షణగా నిలిచారు.

  బీజేపీ దాడులకు భయపడను

  బీజేపీ దాడులకు భయపడను

  బీజేపీ కార్యకర్తల తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు భయపడేది లేదు అని శివాజీ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎంతవరకైనా సిద్దమే అని అన్నారు. ఏపీకి ద్రోహం చేసిన బీజేపీని వదిలిపెట్టేది లేదు అని శివాజీ అన్నారు.

  English summary
  Film Actor Shivaji was attacked by BJP cadre at Gannavaram airport near to AP state capital. This attack happens at BJP Chief Kanna Laxmi Narayana. Shivaji has been fighting for special status for few months. And He made serious comments on Modi and BJP Governemnt.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more