»   » నేను అర్హుడిని కాదా.. అవార్డు వెనక్కి ఇస్తా.. తీసుకెళ్లండి.. క్రిటిక్స్‌పై అక్షయ్ మండిపాటు

నేను అర్హుడిని కాదా.. అవార్డు వెనక్కి ఇస్తా.. తీసుకెళ్లండి.. క్రిటిక్స్‌పై అక్షయ్ మండిపాటు

Posted By:
Subscribe to Filmibeat Telugu

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు తనకు దక్కడంపై రకరకాల స్టేట్‌మెంట్లు చేస్తున్న విమర్శకులపై బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మండిపడ్డారు. తనపై విమర్శకులు తీరును ఆయన తప్పపట్టారు. రుస్తుం చిత్రంలో నటనకు గానూ అక్షయ్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ నటుడు అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు రావడంపై పలువురు విమర్శలు చేయడం అక్షయ్ కుమార్‌ ఆగ్రహానికి కారణమైంది. బాలీవుడ్‌లో స్టంట్ మెన్ల సంక్షేయం కోసం అక్షయ్ కుమార్ ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

అవార్డును వెనుకకు తీసుకెళ్లండి..

అవార్డును వెనుకకు తీసుకెళ్లండి..

ఒకవేళ జాతీయ ఉత్తమ నటుడు అవార్డుకు తాను అర్హుడిని కాకపోతే క్రిటిక్స్ అవార్డును వెనుకకు తీసుకెళ్ల వచ్చు. గత 25 ఏండ్లుగా నేను వింటూనే ఉన్నాను. ఎవరికైనా అవార్డు వస్తే చర్చ మొదలవుతుంది. ఇది కొత్తేమీ కాదు. కొందరు పనికట్టుకొని వివాదంగా మలుస్తారు అని అక్షయ్ అన్నారు.

అర్హుడిని కాకపోతే..

అర్హుడిని కాకపోతే..

ఒకరికి అవార్డు వస్తే సరికాదు.. మరొకరికి రావాల్సింది అని మీడియాలో నోటికి వచ్చినట్టు మాట్లాడుతారు. ఉత్తమ నటుడు అవార్డు రావడం గత 26 ఏళ్లలో మొదటిసారి. ఆ అవార్డుకు నేను అర్హుడిని కాకపోతే అది కూడా మీరు తీసుకొండి అని ఖిలాడీ హీరో తెలిపారు.

అలాంటి వాటి కోసం కష్టపడాలి..

అలాంటి వాటి కోసం కష్టపడాలి..

సామాజిక సేవ చేస్తున్నందుకు మీ పేరు పద్మభూషణ్‌కు మీ పేరు పరిశీలిస్తున్నారట కదా అని మీడియా ప్రశ్నించగా.. అలాంటి అవార్డులు పొందడానికి చాలా కష్టపడాలి. బాగా శ్రమించాలి. మన సేవలను మెచ్చి ప్రజలు అనుకొంటనే వాటికి న్యాయం చేకూరుతుంది అని అక్షయ్ అభిప్రాయపడ్డారు.

అక్షయ్‌కి అవార్డుపై విమర్శలు

అక్షయ్‌కి అవార్డుపై విమర్శలు

జాతీయ అవార్డులు ప్రకటించినప్పటి నుంచి అక్షయ్ కుమార్‌పై ఓ వర్గం విమర్శలు సంధిస్తున్నది. దంగల్ సినిమాలో నటించిన అమీర్‌ఖాన్‌కు అవార్డు రాకపోవడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. రుస్తుం చిత్రంలోని అక్షయ్ నటనను పోల్చుకొంటే అమీర్ మేలు అనే వాదన వినిపిస్తున్నది. జాతీయ అవార్డులు ప్రకటించినప్పుడు నాకు నిజాయితీగా ఈ పురస్కారం వచ్చింది. నేను ఎవరికీ ఫోన్ చేసి అవార్డును ఇవ్వమని అడుగలేదు అని అక్షయ్ చెప్పిన సంగతి తెలిసిందే.

స్టంట్‌మెన్ల సేవలు గుర్తించాలి

స్టంట్‌మెన్ల సేవలు గుర్తించాలి

సినిమాలో ప్రాణాలకు తెగించి పోరాటాలు చేసే స్టంట్ మాస్టర్ల సంక్షేమం కోసం కొంత కృషి చేస్తున్నాను. వారి సంక్షేమానికి బాలీవుడ్‌లో కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి. అందుకోసం నా శాయశక్తుల కృషి చేస్తాను. స్టంటుమెన్ల సేవలను సినీ పరిశ్రమ గుర్తించాల్సిన అవసరం ఉంది అని అన్నాడు.

English summary
Akshay's winning his first National Award for his role in 'Rustom' was met with criticism with many arguing that it was not fair. Bollywood actor Akshay Kumar asked critics to take the award back if they felt he did not deserve it. Akshay told reporters, "I've been hearing it for past 25 years, whenever someone wins there is some discussion around it. This is not new. Someone or the other always creates a controversy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu