»   » వర్షాల్లో చిక్కుకుపోయిన హీరోలు, ట్వీట్లూ: బాలీవుడ్ కూ ముంబై వరదల దెబ్బ

వర్షాల్లో చిక్కుకుపోయిన హీరోలు, ట్వీట్లూ: బాలీవుడ్ కూ ముంబై వరదల దెబ్బ

Posted By:
Subscribe to Filmibeat Telugu

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపిలేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ముంబైకర్లు అతలాకుతలం అవుతున్నారు. 'టైఫూన్‌ తరహా వాతావరణం' నగరాన్ని చుట్టేయడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 2005 జూలై 26న ముంబై నగరాన్ని భారీ వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. ఆ తర్వాత అంతటి విపత్తు ఇదేనని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

ఫ‌రాఖాన్

ఒక విధంగా చెప్పాలంటే ముంబై మునిగింది. రోడ్లు చెరువులుగా మారాయి. లోక‌ల్ ట్రైన్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇటు బాలీవుడ్ తార‌లు కూడా వ‌ర‌ద‌లో చిక్కుకున్నారు. ఫ‌రాఖాన్ తాను వ‌ర‌ద‌లో చిక్కుకున్న వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. భారీ వర్షం వల్ల ముంబై శాంటా క్రూజ్‌ ప్రాంతంలో వరదనీటిలో అనుపమ్‌ ఖేర్‌ కారు చిక్కుకుపోయిందట.

అనుపమ్‌ ఖేర్‌

దీంతో గత్యంతరం లేక బాంద్రాలోని తన స్నేహితునికి ఫోన్‌ చేస్తే.. అతను, అతని కూతురు తనను రక్షించడానికి ముందుకొచ్చారని, అతని ఇంట్లో అత్యవసరంగా ఆశ్రయం పొందానని బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ సోమవారం రాత్రి ట్వీట్‌ చేశారు. ఆపత్కాలంలో ఆదుకోవడం, మానవ సంబంధాలను చాటడంలో ముంబై లాంటి నగరం ప్రపంచంలో ఎక్కడా ఉండదని ఆయన పేర్కొన్నారు. వర్షం కారణంగా తాను గమ్యస్థానం చేరలేకపోయానని ఆయన తెలిపారు.

మాధవన్‌

ఇక, మరో బాలీవుడ్‌ హీరో మాధవన్‌ సైతం ఇదేవిధంగా వర్షాల్లో కష్టాలు ఎదుర్కొన్నారు. కారులో ఆయన ఇంటికి వెళుతుండగా.. ఇంటికి సమీపంలో కారు చెడిపోయింది. దీంతో మోకాళ్ల లోతు నీళ్లలో నడుచుకుంటూ ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని, ఈ ఘటన ఉత్సుకతతోపాటు చిరాకు కలిగించిందని మాధవన్‌ ట్వీట్‌ చేశారు.

అభిషేక్ బ‌చ్చ‌న్

కారు చుట్టూ భారీగా నిలిచిన వరదనీటి వీడియోను ఆయన షేర్‌ చేసుకున్నారు. హీరోయిన్‌ హ్యుమా ఖురేషీ కూడా వర్షాల వల్ల రోడ్డు మీద మూడుగంటలపాటు ట్రాఫిక్‌లో చిక్కుపోయినట్టు ట్వీట్‌ చేశారు.ఇటు అభిషేక్ బ‌చ్చ‌న్ త‌న ఇంటి ఫొటోలు తీసి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

48 గంట‌ల పాటు

ప్రియాంకా చోప్రాతో పాటు ప‌లుగురు హీరోయిన్లు ముంబై వాసుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. మ‌రో రెండు రోజుల పాటు ఎవ‌రూ ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని , 48 గంట‌ల పాటు ముంబైలో భారీ వాన‌లు ప‌డే అవ‌కాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని కోరారు. ముంబైయిలోని స్కూళ్ల‌కు, ఆఫీసుల‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం.

English summary
Bollywood actors R Madhavan and Anupam Kher got stuck in Mumbai rains and shared videos on social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu