»   » బాయ్ ఫ్రెండుతో నితిన్ మూవీ హీరోయిన్ వివాహం (ఫోటోస్)

బాయ్ ఫ్రెండుతో నితిన్ మూవీ హీరోయిన్ వివాహం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ హృషిత భట్ గుర్తుందా..? నితిన్ హీరోగా 2006లో వచ్చిన 'రామ్' అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్లాప్ కావడంతో అమ్మడు మళ్లీ తెలుగులో కనిపించలేదు. తాజాగా ఈ భామ తన బాయ్ ఫ్రెండ్ ఆనంద్ తివారిని పెళ్లాడింది.

బాలీవుడ్ నుండి అందుతున్న వార్తల ప్రకారం హృషిత భట్-అంకిత్ తివారీ వివాహం మార్చి 4న ముంబైలో జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు వర్గాల కుటుంబ సభ్యులు, కొందరుసన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వీరి వివాహ ఫోటోలపై ఓ లుక్కేయండి మరి.

పెళ్లి ఫోటో

పెళ్లి ఫోటో

హృషిత భట్ భర్త ఆనంద్ తివారీ యునైటైడ్ నేషన్స్ సీనియర్ దౌత్యవేత్తగా పని చేస్తున్నారు. దాదాపు ఆరు నెలలుగా వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది. డేటింగ్ తర్వాతే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

 స్టన్నింగ్ లుక్

స్టన్నింగ్ లుక్

హృషిత భట్ వివాహం అనంతరం తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేసింది. ప్రీతి సింగ్ డిజైన్ చేసిన లెహంగాలో అమ్మడు ఎంతో అందంగా కనిపించింది.

 రిసెప్షన్ పార్టీ

రిసెప్షన్ పార్టీ

పెళ్లి సింపుల్ గా చేసుకున్నప్పటికీ రిసెప్షన్ పార్టీ మాత్రం గ్రాండ్ గా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మార్చి 10న ఢిల్లీలో, తర్వాత ముంబైలో రిసెప్షన్ పార్టీ జరుగబోతోంది.

హృషిత భట్

హృషిత భట్

తన పెళ్లి గురించి హృషిత భట్ మాట్లాడుతూ.... పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది. హడావుడి లేకుండా కుటుంబ సభ్యులు మధ్య మాత్రమే ఈ వేడుక జరుగాలని అంతా నిర్ణయించుకుని ఇలా చేసాం. అంతే తప్ప మరేమీ లేదు అన్నారు.

 ఆశీర్వాదం కావాలి

ఆశీర్వాదం కావాలి

మాకు మీ ఆశీర్వాదంతో పాటు అభిమానుల ఆశీర్వాదం కావాలి. త్వరలో కొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్నాను, ఎంతో ఎగ్జైట్మెంట్ గా ఉంది అని హృషిత భట్ తెలిపారు.

పెళ్లి తర్వాత ఢిల్లీకి

పెళ్లి తర్వాత ఢిల్లీకి

ప్రస్తుతం ముంబైలో ఉంటున్న హృషిత భట్ పెళ్లి తర్వాత ఢిల్లీ వెళ్లబోతున్నట్లు తెలిపారు. అంటే సినిమాకు దాదాపుగా గుడ్ బై చెప్పినట్లే అని అనుకోవద్దు. కొంతకాలం పాటు సినిమాల్లోనూ నటిస్తాను అంటోంది.

English summary
Remember Hrishitaa Bhatt, who made her debut with none other than the king of Bollywood, Shahrukh Khan in Asoka? The actresss recently surprised her fans with the news of her wedding with beau Anand Tiwari. According to Mumbai Mirror, the couple tied the knot in a simple ceremony in Delhi on March 4. The wedding was attended by both the families and close friends.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu