జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు ప్రీతిజింటా.. సల్మాన్‌కు పరామర్శ
కృష్ణజింకల వేట కేసులో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌కు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కోర్టు గురువారం ఐదేళ్ల శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధించిన సంగతి విదితమే. 1998లో హమ్ సాథ్ సాథ్ హై చిత్ర షూటింగ్ సందర్భంగా కృష్ణ జింకలను వేటాడినట్టు సల్మాన్‌తోపాటు టబు, సైఫ్ ఆలీఖాన్, నీలం, సొనాలి బింద్రేలపై కేసు నమోదైంది. ఈ కేసులో సైఫ్, టబు, సొనాలీ, నీలంను జోధ్‌పూర్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కోర్టు తీర్పు అనంతరం బెయిల్ లభించకపోవడంతో సల్మాన్ ఖాన్ జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో గురువారం రాత్రి గడిపాడు. శుక్రవారం కూడా బెయిల్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో మరో రోజు కూడా సల్మాన్ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాగా, ఈ కేసులో జైలుశిక్ష పడిన సల్మాన్ ఖాన్‌కు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. కాగా, శుక్రవారం సల్మాన్ ఖాన్‌ను బాలీవుడ్ సినీ తార ప్రీతిజింటా జోధ్‌పూర్ కోర్టులో కలుసుకొన్నారు. జైలులో సల్మాన్ ఖాన్‌ను పరామర్శించారు. అతడి యోగక్షేమాలు తెలుసుకొన్నట్టు సమాచారం. బాలీవుడ్‌లో సల్మాన్, ప్రీతి జింటాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. తన స్నేహితుడు కష్టాల్లో కూరుకుపోవడంతో స్వయంగా వెళ్లి సల్మాన్ పరామర్శించడం గమనార్హం.


Click it and Unblock the Notifications











