»   » బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్‌ అరెస్ట్..

బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్‌ అరెస్ట్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహారుషి వాల్మీకిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీసావంత్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకపోయడంతో లూధియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ముంబైకి బయలుదేరిన పంజాబ్ పోలీసులు మంగళవారం మధ్నాహ్నం రాఖీ సావంత్‌ను అరెస్ట్ చేశారు.

వాల్మికీపై అనుచిత వ్యాఖ్యలు

వాల్మికీపై అనుచిత వ్యాఖ్యలు

హిందూ పురాణం రామాయణాన్ని రచించిన వాల్మీకిపై రాఖీ సావంత్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అందుకు లూధియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతేడాది ఓ ప్రైవేటు టెలివిజన్ కార్యక్రమంలో వాల్మికీ కమ్యూనిటీపై రాఖీ అనుచిత వ్యాఖ్యలు చేసింది.

వాల్మికీ కమ్యూనిటీ ఆగ్రహం

వాల్మికీ కమ్యూనిటీ ఆగ్రహం

తమ మనోభావాలను కించపరిచే విధంగా రాఖీ వ్యాఖ్యలు చేసిందనే ఆరోపణలపై కమ్యూనిటీ సభ్యులు గతంలో రాఖీపై పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసు విచారణలో భాగంగా ఇటీవల స్థానిక లూధియానా కోర్టు వారెంటు జారీ చేసింది.

మత మనోభావాలను..

మత మనోభావాలను..

రాఖీ సావంత్ నటిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి పోయి.. తమ మత విశ్వాసాలకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసింది. అందుకు గాను తాము ఆమెపై పోలీసులకు, కోర్టులో ఫిర్యాదు చేశాం అని కమ్యూనిటీ సభ్యుడు మీడియాకు వెల్లడించారు.

నోటీసులకు స్పందించలేదు

నోటీసులకు స్పందించలేదు

ఈ కేసుకు సంబంధించి రాఖీ సావంత్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దాంతో ఆగ్రహించిన కోర్టు రాఖీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. లూధియానా కోర్టు వారెంట్ల జారీ నేపథ్యంలో ఇద్దరు సభ్యులతో కూడిన పోలీసుల బృందం రాఖీ సావంత్‌ను అరెస్ట్ చేయ్యడానికి ముంబై బయలుదేరి వెళ్లినట్టు సమాచారం. తదుపరి విచారణను ఏప్రిల్ 10 తేదీకి వాయిదా వేసింది.

English summary
Bollywood actress Rakhi Sawant Arrested for allegedly making objectionable remarks against sage Valmiki. Recently Ludhiana Court has issued an arrest warrant against Rakhi. The warrant was issued on March 9 on the basis of a complaint filed against her for allegedly hurting religious sentiments of Valmiki community with her comments on a programme on a private television channel last year
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu