For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘సై రా’.... చిరంజీవి కాస్టూమ్స్ ఖర్చు తెలిస్తే షాకే!

  By Bojja Kumar
  |
  Chiranjeevi Wearing Most Expensive Costumes In "SYE RAA" ఖర్చు తెలిస్తే షాకే!

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరిసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. సైరా' అక్టోబర్ 20 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. నానక్ రామ్ గూడ, ఫిల్మ్ సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు పెట్టే ఖర్చు హాట్ టాపిక్ అయింది.

  చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్

  చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్

  చిరంజీవి కోరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కేవలం తెలుగు పరిశ్రమకో, దక్షిణాది భాషలకో పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగిన విధంగా రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు.

  కాస్ట్యూమ్స్ ఖర్చే రూ. 5 కోట్లు

  కాస్ట్యూమ్స్ ఖర్చే రూ. 5 కోట్లు

  ఈ చిత్రంలో చిరు లుక్, ఆయన కాస్టూమ్స్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. సినిమాలో ఆయా సన్నివేశాలకి తగిన విధంగా చిరు ధరించే దుస్తుల దగ్గర నుండి, చెప్పుల వరకు ప్రత్యేకంగా డిజైన్ చేయిస్తున్నారు. ఇందుకోసం బాలీవుడ్ లో భారీ సినిమాలకి పనిచేసిన డిజైనర్లను చరణ్ రంగంలోకి దింపాడని, ఇందుకోసం రూ. 5 కోట్లు వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

  భారీ తారాగణం

  భారీ తారాగణం

  ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో, సౌత్ చిత్ర సీమలో బాహుబలిని మించిన సినిమా లేదు. అయితే 'బాహుబలి'ని మించేలా 'సై రా నరసింహారెడ్డి' సినిమా తెరకెక్కబోతోంది. ఊహకు కూడా అందని భారీ తారాగణంతో ఈ సినిమా రాబోతోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ తొలిసారిగా తెలుగు సినిమాలో నటించబోతున్నారు. ఈయనతో పాటు పలువురు స్టార్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

  అతిపెద్ద ప్రాజెక్ట్

  అతిపెద్ద ప్రాజెక్ట్

  ఈ చిత్రానికి మెగాస్టార్ తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సురేందర్ రెడ్డి కెరీర్లోనే ఇదే అతి పెద్ద ప్రాజెక్ట్. ఆయన ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నారు.

  ప్రముఖులు తప్పుకున్నారంటూ రూమర్స్

  ప్రముఖులు తప్పుకున్నారంటూ రూమర్స్

  అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న తరుణంలో ఈ సినిమాకు అనుకోని ఆటంకాలు ఎదురవుతున్నాయంటూ ప్రచారం మొదలైంది. 'సై రా' సినిమా నుండి మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ తప్పుకుంటున్నాడంటూ పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి మరిచిపోక ముందే మరో వార్త తెరపైకి వచ్చింది. ఈ చారిత్రక చిత్రం నుంచి సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ తప్పుకున్నాడంటూ తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. ఇతర కమిట్‌మెంట్స్‌తో డేట్స్ అడ్జస్ట్ చేయలేక మెగాస్టార్ సినిమాకి రవివర్మన్ నో చెప్పినట్లు చర్చించుకుంటున్నారు. ఆయన స్థానంలో రత్నవేలును సినిమాటోగ్రాఫర్‌గా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

  క్లారిటీ ఇవ్వని టీం

  క్లారిటీ ఇవ్వని టీం

  అయితే రెహమాన్, రవి వర్మ ఈ చారిత్రక ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు అఫీషియల్ సమాచారం అయితే లేదు. బయట ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతున్నా.... చిత్ర యూనిట్ నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో మెగా అభిమానుల్లో అయోమయం నెలకొంది.

  English summary
  Sye Raa Narasimha Reddy is an important film for Chiranjeevi now. After a commercial success in the form of Khaidi No 150, the actor has chosen to come up with a period drama entertainer. Meanwhile, the pre-production work also began at a rapid pace. We have come to know that the senior and top stylist Anju Modi is on board for the project and she is going to design the outfits and the ornaments for Chiranjeevi and the other artists of the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X