Don't Miss!
- News
50 మంది ప్రయాణికులు వదిలేసి వెళ్లిన విమానం: ‘గో ఫస్ట్’కు రూ. 10 లక్షలు జరిమానా
- Sports
అందుకే పృథ్వీ షా, చాహల్‌ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా
- Travel
వస్త్ర ప్రపంచానికి మన పెడన కలంకారి ఓ అలంకరణ!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Lifestyle
ఎదుటివారి సంతోషం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు.. ఈ చిట్కాలు మీకోసమే
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
ఫైటర్ చిత్రంలో విజయ్ దేవరకొండ తండ్రిగా బాలీవుడ్ స్టార్ హీరో
సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫైటర్ చిత్రంలో మరో బాలీవుడ్ నటుడు చేరారు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు తండ్రిగా సునీల్ శెట్టి కనిపించబోతున్నాడు.
ఫైటర్ చిత్రంలో కథలో భాగంగా వచ్చే ఫ్లాష్ బ్యాక్‌లో సునీల్ శెట్టి పాత్ర వస్తుంది. ఆ పాత్ర ప్రత్యేక పాత్రగా ఉంటుంది. అయితే ఈ వార్తను ఇంకా చిత్ర యూనిట్ ధృవీకరించారు. అయితే లాక్‌డౌన్‌కు శరవేగంగా సాగిన షూటింగ్ కరోనావైరస్ పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.

లాక్‌డౌన్ తర్వాత ఫైటర్ షూటింగ్‌ను మొదలుపెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే షూటింగ్ ప్రారంభమైన తర్వాత సునీల్ శెట్టి ఈ షూటింగులో పాల్గొంటారని తెలుస్తున్నది. ఫైటర్ చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్నారు. హీరోయిన్‌గా అనన్యపాండే టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్నది.
ఇక ఫైటర్ టైటిల్‌ను మార్చే పనిలో ఉన్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ సినిమామకు లైగర్ అనే టైటిల్ పరిశీలనలో ఉందనే తెలుస్తున్నది. ఈ టైటిల్ వెనుక ఆసక్తికరమైన కథ ఉండటంతో లైగర్‌నే ఖారారు చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.