»   » బూతు+కామెడీ కలిపి కొట్టు, కలెక్షన్లు రాబట్టు (ఫోటోస్)

బూతు+కామెడీ కలిపి కొట్టు, కలెక్షన్లు రాబట్టు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మధ్య బాలీవుడ్లో వచ్చిన 'గ్రాండ్ మస్తీ' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పెద్దలకు మాత్రమే పరిమితమైన బూతు కామెడీ సీన్లు, డైలాగులతో కూడిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద నిర్మాతలకు కలెక్షన్ల పంట పండింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇలాంటి సినిమాలు కోరుకునే ప్రేక్షకులు కూడా చాలా మంది ఉన్నారని!

యాక్షన్ సినిమాలు, లవ్ స్టోరీలతో కూడిన సినిమా, ఫ్యామిలీ సెంటిమెంటు సినిమాలు, హారర్ సినిమాల మధ్యలో అప్పుడప్పుడూ వచ్చే ఈ తరహా బూతు కామెడీ సినిమాలను అడల్ట్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కలెక్షన్లు రాబట్టేందుకు ఇదో మంచి ఫార్ములా కావడం, బడ్జెట్ కూడా పెద్దగా అవసరం లేక పోవడంతో ఇలాంటి సినిమాల జోరు ఈ మధ్య బాగా పెరుగుతోంది.

ఈ తరహా కాన్సెప్టుతో గతంలో వచ్చిన మస్తీ, క్యా కూల్ హై హమ్ లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. బాలీవుడ్లో వచ్చిన మొట్టమొదటి అడల్డ్ కామెడీ చిత్రం బసు చటర్జీ తెరకెక్కించిన 'షౌకీన్'. 1982లో ఈచిత్రం వచ్చింది. స్లైడ్ షోలో అడల్ట్ కామెడీ చిత్రాలకు సంబంధించిన వివరాలు, ఫోటోలు...

మస్తీ

మస్తీ

బాలీవుడ్ మోస్ట్ పాపులర్ అడల్ట్ కామెడీ చిత్రాల్లో ‘మస్తీ' చిత్రం కూడా ఒకటి. వివేక్ ఒబెరాయ్, అఫ్తాబ్ శివ్ దాసాని, రితేష్ దేశ్ ముఖ్ హీరోలుగా నటించారు.

క్యా కూల్ హై హమ్

క్యా కూల్ హై హమ్

రితేష్ దేశ్ ముఖ్, తుషార్ కపూర్ నటించిన ‘క్యా కూల్ హై హమ్' అనే అలర్డ్ చిత్రం కూడా మంచి విజయం సాధించింది.

యే క్యా హో రహా హై

యే క్యా హో రహా హై

అమెరికన్‌పై చిత్రం ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ అడల్ట్ కామెడీ చిత్రం ‘యే క్యా హో రహా హై' చిత్రం కూడా మంచి కలెక్షన్లు సాధించింది.

నో ఎంట్రీ

నో ఎంట్రీ

సల్మాన్ ఖాన్ నటించిన ‘నో ఎంట్రీ' అనే అడల్ట్ బాలీవుడ్ చిత్రం కూడా బాగా ప్రేక్షకాదరణ పొందింది.

మిర్చి

మిర్చి

జెండర్ ఈక్వాలిటీ, హ్యూమన్ సెక్సువాలిటీ ఆధారంగా తెరకెక్కించిన అడల్ట్ కామెడీ బాలీవుడ్ చిత్రం ‘మిర్చి' చిత్రం మంచి విజయం సాధించింది.

క్యా సూపర్ కూల్ హై హమ్

క్యా సూపర్ కూల్ హై హమ్

బాలీవుడ్లో తెరకెక్కిన మరో అడల్ట్ కామెడీ చిత్రం ‘క్యా కూల్ హై హమ్' చిత్రం కూడా మంచి విజయం సాధించింది.

గో గోవా గాన్

గో గోవా గాన్

అడల్ట్ కామెడీ, డ్రగ్స్ నేపథ్యంలో వచ్చిన మరో చిత్రం ‘గో గోవా గాన్'.

గ్రాండ్ మస్తీ

గ్రాండ్ మస్తీ

‘మస్తీ' చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘గ్రాండ్ మస్తీ' చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది.

English summary
The genre of comedy has reached a higher level when the common jokes are no more going to make you laugh. A special genre of adult comedy has taken its toll on the contemporary one and these days, a lot of Bollywood comedy films are focusing on adult jokes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu