»   » సాహో లోకి మరో బాలీవుడ్ అందం: ప్రభాస్ సినిమాలోకి 40 ఏళ్ళ బ్లాక్ బ్యూటీ

సాహో లోకి మరో బాలీవుడ్ అందం: ప్రభాస్ సినిమాలోకి 40 ఏళ్ళ బ్లాక్ బ్యూటీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

మందిరా బేడీ అంటే బహుశా తెలియని వారుండరు. 1994వ సంవత్సరంలో దూరదర్శన్‌లో ప్రసారమయిన శాంతి సీరియల్‌లో టైటిల్ రోల్లోనటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మందిరా బేడీ దేశంలోనే తనకంటూ ఒక ప్రత్యేకతను, గుర్తింపును సాదించుకుంది. అంతా మర్చిపోతున్న సమయం లో మళ్ళీ పతాకశీర్శికలకెక్కిందీ నిన్నటి తరం బ్లాక్ బ్యూటీ. సాహోలో మందిరా కూడా కనిపించనుందంటూ వచ్చిన వార్తలు ఒక్కసారి ఈ 40 హాట్ ఉమెన్ ని మళ్ళీ వార్తల్లోకి తెచ్చాయి.

ప్ర‌భాస్ సినిమా సాహో

ప్ర‌భాస్ సినిమా సాహో

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న సినిమా సాహో...యూవీ క్రియేష‌న్స్ రూ. 150 కోట్ల‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఒకేసారి చిత్రీక‌రిస్తున్నారు. ఈ మూడు భాష‌ల‌తో పాటు మ‌ళ‌యాళం, క‌న్న‌డ‌లో్నూ రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు.


జాతీయ స్థాయిలో

జాతీయ స్థాయిలో

ఓ ప్రాంతీయ చిత్రంలా కాకుండా...జాతీయ స్థాయిలో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాకు న‌టీన‌టుల్ని కూడా బాలీవుడ్ నుంచే ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ లీడింగ్ హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ ను ప్ర‌భాస్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ఎంపిక చేశారు. సినిమాలో మ‌రికొన్ని కీల‌క‌పాత్ర‌ల కోసం జాకీష్రాఫ్‌, నీల్ నితిన్ ముఖేశ్‌, చుంకీ పాండే, టిన్నూ ఆనంద్ ను తీసుకున్నారు. ఇప్పుడు ఈ బాలీవుడ్ భామ‌కు సాహోలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది.


నార్త్ లోనూ స్టార్ ఇమేజ్

నార్త్ లోనూ స్టార్ ఇమేజ్

బాహుబలితో నార్త్ లోనూ స్టార్ ఇమేజ్ సాధించిన ప్రభాస్, తన నెక్ట్స్ సినిమాతో అక్కడ మరింతగా పాతుకుపోయేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఈ సినిమాకు ఎక్కువగా నార్త్ ఫ్లేవర్ యాడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ గా శ్రద్దా కపూర్ ను ఫైనల్ చేసిన సాహో యూనిట్, ప్రతి నాయకులుగా బాలీవుడ్ స్టార్స్ నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండేలను తీసుకున్నారు.


బాలీవుడ్ నుంచే దిగుమతి

బాలీవుడ్ నుంచే దిగుమతి

సాంకేతిక నిపుణులను కూడా బాలీవుడ్ నుంచే దిగుమతి చేసుకుంటున్నారు సాహో టీం. సంగీత దర్శకులుగా శంకర్ ఇషాన్ లాయ్ లను ఎంపిక చేశారు. తాజాగా సాహో సెట్ లోకి మరో బాలీవుడ్ తార ఎంటర్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. హాట్ హాట్ ఫోటో షూట్ లతో అలరించే బాలీవుడ్ భామ మందిర బేడీ సాహో లో కీలక పాత్రలో నటించనుందట. అది కూడా నెగిటివ్ రోల్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ సినిమాల కనిపిస్తున్న సాహో లో ఇంకెంత మంది ఉత్తరాది తారలు కనిపించనున్నారో.


English summary
As per Latest reports Bollywood Star Mandira Bedi to Act In Prabhas Sahoo .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu