సినీ పరిశ్రమలో చేతబడి, క్షుద్రపూజలు.. మంత్రగాళ్ల మత్తులో టాప్ హీరో, హీరోయిన్లు.. వారెవరంటే..

By Rajababu

సినీ పరిశ్రమలో అనేక మూఢ నమ్మకాలను, జాతకాలను తారలు బలంగా విశ్వసిస్తారనేది ఇప్పటి మాట కాదు. సినీ పరిశ్రమలో సక్సెస్ కోసం పూజలు, క్షుద్ర పూజలు నిర్వహిస్తారన్న విషయంపై ఎన్నో సంవత్సరాల నుంచి వార్తలు, కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ తారలపై క్షుద్ర పూజలు, మంత్రగాళ్లను ఆశ్రయించారనే వార్తను తాజాగా ఓ ఆంగ్ల పత్రిక సెన్సేషనల్ కథనాన్ని వండింది. ఇంతకు ఆ కథనలో ఏమున్నదంటే..

 రణ్‌బీర్, కత్రినా క్షుద్రపూజలు

రణ్‌బీర్, కత్రినా క్షుద్రపూజలు

బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్‌లు చాలా రోజులు చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగారు. వారిద్దరూ బాంద్రాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సహజీవనం కూడా చేశారు. ఆ సమయంలో కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు ఆ నివాసంలో క్షుద్ర పూజలు నిర్వహించారు.

సక్సెస్ కోసం క్షుద్రశక్తుల..

సక్సెస్ కోసం క్షుద్రశక్తుల..

బాంబే వెల్వెట్, తమషా లాంటి అట్టర్ ఫ్లాప్ చిత్రాలతో రణ్‌బీర్ కపూర్, బార్ బార్ దేఖో ఫ్లాప్‌తో కత్రినా అప్పటికే అల్లాడిపోతున్నారు. ఆ సందర్భంగా ఫ్లాప్ నుంచి బయటపడటానికి క్షుద్రశక్తులను ప్రసన్నం చేసుకొన్నారని తాజా వార్తలో వెల్లడించారు.

 కత్రినా, రణ్‌బీర్‌పై చేతబడి

కత్రినా, రణ్‌బీర్‌పై చేతబడి

కత్రినా, రణ్‌బీర్ కెరీర్ ప్రమాదంలో పడటానికి వారి స్నేహితుడే కారణమని, వారిని చూసి ఓర్వలేక వారిపై చేతబడి చేయించాడని మంత్రగాళ్లు చెప్పినట్టు కథనంలో పేర్కొన్నారు. ఆ కారణంగానే కెరర్ అసందిగ్ధ పరిస్థితిలో కూరుకుపోయిందని చెప్పినట్టు సమాచారం.

ఫ్లాప్‌ల నుంచి బయటపడటం కోసం

ఫ్లాప్‌ల నుంచి బయటపడటం కోసం

కత్రినా, రణ్‌బీర్‌ను పట్టి పీడిస్తున్న క్షుద్ర శక్తులను తరిమి కొట్టడానికి మంత్రాలు చేయడంతోపాటు, కొన్ని రాళ్లను కూడా ఇంట్లో పెట్టినట్టు కథనంలో పేర్కొన్నారు. అయితే అలాంటి క్షుద్ర పూజలు కూడా వారిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించలేకపోవడం ఈ కథనంలో ఆసక్తికరమైన అంశంగా నిలిచింది.

 తమ ప్రత్యర్థి తారలపై చేతబడి

తమ ప్రత్యర్థి తారలపై చేతబడి

రణ్‌బీర్ కపూర్, కత్రికా కైఫ్ పైనే కాకుండా తమ ప్రత్యర్థిగా, పోటీగా మారే తారలపై తరచూ ఇలాంటి క్షుద్ర ప్రయోగాలు జరుగుతాయనే విషయం తాజాగా బయటపడింది. చేతబడి చేయడం కోసం బొమ్మలకు సూదులు గుచ్చడం, తాంత్రిక అంశాలతో చేతబడి ప్రయోగాలు చేయడం అనవాయితీగా వస్తున్నదట.

మంత్రగాళ్ల కోసం సినీ తారలు

మంత్రగాళ్ల కోసం సినీ తారలు

బాలీవుడ్‌లో 40కిపైగా మంత్రగాళ్లు సినీతారల కోసం పనిచేస్తారనే విషయం బయటపడటం గమనార్హం. ప్రేమలో విఫలమైతే దానిని పరిష్కరించడం , లేదా సక్సెస్ బాట పట్టడం, మానసిక రుగ్మతల నుంచి బయటపడటం లాంటి వాటి కోసం సినీ తారలు మంత్రగాళ్లను సంప్రదిస్తారనే విషయం సెన్సేషనల్‌గా మారింది.

 ఓ సూపర్‌స్టార్ నిర్వాకం

ఓ సూపర్‌స్టార్ నిర్వాకం

క్షుద్ర శక్తుల బారిన పడకుండా బాలీవుడ్‌కు చెందిన ఓ సూపర్‌స్టార్ తన జన్మదినం రోజున 5 కేజీల క్రిస్టల్స్ కొనుగోలు చేశాడట. అలాగే ఓ స్టార్ హీరోయిన్ బొమ్మకు ఎన్ని సూదులు గుచ్చితే ఫలితం అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకొన్నారట.

 చేతబడులు, పూజలపై గట్టినమ్మకం

చేతబడులు, పూజలపై గట్టినమ్మకం

సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరు చేతబడులను, క్షుద్ర పూజలను బాగా నమ్ముతారు. వారికి ఫలితం కనిపిస్తే మరింత నమ్మకం కుదురుతుంది. ఒకవేళ ఫలితం దక్కకపోతే మరో మార్గాన్ని వెతుక్కొంటారు అని ఓ క్షుద్ర ఉపాసకుడు వెల్లడించినట్టు కథనంలో తెలిపారు.

 తాజాగా పెళ్లైన హీరోయిన్ కూడా

తాజాగా పెళ్లైన హీరోయిన్ కూడా

బాలీవుడ్‌లో క్షుద్ర పూజల గురించి వందల సంఖ్యలో సంఘటనలు ఉన్నాయని ప్రముఖ దర్శకుడు మహేష్‌భట్ చెప్పినట్టు కథనంలో పేర్కొన్నారు. ఇటీవల పెళ్లైన ఓ హీరోయిన్ కూడా చేతబడులను, క్షుద్ర పూజలను నిర్వహిస్తారనే విషయం వెలుగు చూసింది. డైరెక్టర్లు తనను తీసుకోవడానికి, ప్రాజెక్టుల్లో తనను తీసుకొనే విధంగా క్షుద్ర పూజలు నిర్వహించేదనే విషయం సెన్సేషనల్‌గా మారింది.

కంగన రనౌత్ కూడా

కంగన రనౌత్ కూడా

కంగన రనౌత్‌కు కూడా చేతబడులు, క్షుద్ర పూజలను బాగా నమ్ముతుందని ఆమె మాజీ ప్రియుడు ఆధ్యాయన్ సుమన్ చెప్పడం ఆసక్తిని రేపింది. క్షుద్ర పూజలను నిర్వహించడం తప్పుకాదు అని కంగన చెప్పడంతో అసలు విషయం బయటపడింది.

 అవార్డు విన్నింగ్ దర్శకుడి నమ్మకం

అవార్డు విన్నింగ్ దర్శకుడి నమ్మకం

ఓ అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌పై కూడా చేతబడి చేసినట్టు ప్రచారంలో ఉండేది. సదరు డైరెక్టర్ షూటింగ్ సజావుగా జరుగకుండా క్షుద్ర పూజలు చేశారట. దాంతో రెండు, మూడు సార్లు షూటింగ్ కారణం లేకుండా వాయిదాపడటంతో ఏదో జరిగిందనే అనుమానం రేకెత్తిందట. దాంతో ఆ యూనిట్ మంత్రగాళ్లను ఆశ్రయించి శాంతిపూజుల నిర్వహించారట. అప్పటి నుంచి సదరు డైరెక్టర్ షూటింగ్ ముందు క్షుద్ర పూజలు చేయడం అలవాటుగా మారిందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X