యూ ఆర్ గ్రేట్.. భోరున ఏడ్చాను.. మాలవత్ పూర్ణకు బిగ్ బీ అభినందన
అత్యంత పిన్నవయస్సులో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ మాలవత్‌ను బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అభినందించారు.
అత్యంత పిన్నవయస్సులో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ మాలవత్‌ను బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అభినందించారు. పూర్ణ జీవిత కథ ఆధారంగా పూర్ణ: కరేజ్ హ్యాస్ నో లిమిట్ అనే చిత్రాన్ని ప్రముఖ నటుడు, నిర్మాత రాహుల్ బోస్ రూపొందించారు.

యూ ఆర్ గ్రేట్
ఈ చిత్రంలో పూర్ణ పాత్రను అధితి ఇనామ్‌దార్ పోషించారు. ఇటీవల రాహుల్ బోస్‌తో కలిసి రియల్ హీరో పూర్ణ, రీల్ లైఫ్ హీరో అదితి బిగ్ బీ అమితాబ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరిపై ప్రశంసల వర్షం కురిపించారు. యూ ఆర్ గ్రేట్ అని పూర్ణను బిగ్ బీ అభినందించారు.

భోరున ఏడ్చాను
ఈ సినిమాను పూర్ణ, ఆమె కుటుంబ సభ్యులకు దర్శకుడు రాహుల్ బోస్ ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని చూసిన పూర్ణ ఉద్వేగానికి గురైంది. ‘నేను సినిమాను చూసినప్పుడు భోరున ఏడ్చాను. చిత్రం చాలా అద్భుతంగా చిత్రీకరించారు. మైండ్ బ్లోయింగ్, అన్ బిలీవబుల్' అని పూర్ణ తెలిపింది. పూర్ణ తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన వండర్ కిడ్.

అంతర్జాతీయ చిత్రోత్సవంలో
పూర్ణ చిత్రం విడుదలైన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో బాలికలకు స్ఫూర్తిని కలిగించేందుకు ఈ చిత్రానికి సంబంధించిన డీవీడీలు, పెన్ డ్రైవ్‌లను దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో పంచుతాను అని దర్శకుడు రాహుల్ బోస్ అన్నారు. ఈ చిత్రాన్ని పలు అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నానని వెల్లడించారు.

మార్చి 31న దేశవ్యాప్తంగా విడుదల
ఈ చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహించడమే కాకుండా పూర్ణకు స్ఫూర్తిని కలిగించిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం మార్చి 31న దేశవ్యాప్తంగా విడుదల కానున్నది.


Click it and Unblock the Notifications











