»   » సైకిల్ ఎక్కిన సల్మాన్.. ముంబై జనారణ్యంలోకి దూసుకెళ్లి.. (వీడియో)

సైకిల్ ఎక్కిన సల్మాన్.. ముంబై జనారణ్యంలోకి దూసుకెళ్లి.. (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఖరీదైన, విలాసవంతమైన కార్లలో కనిపించే బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్.. తాజాగా సైకిలెక్కి జనారణ్యంలోకి ప్రవేశించాడు. ముంబై వీధుల్లోని రోడ్లపై ఝుమ్మని దూసుకుపోయాడు. అలా సైకిల్‌పై సల్మాన్ దూసుకుపోవడాన్ని చూసిన అభిమానులు ఆయనను వెంబడించారు. అయితే సల్మాన్‌కు రక్షణగా ఇద్దరు బాడీగార్డులు ఉండటంతో అభిమానుల రద్దీ నుంచి తేలికగా తప్పించుకొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా సల్మాన్‌ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

సల్మాన్ ఖాన్ నిర్వహించే స్వచ్ఛంద సంస్థ బీయింగ్ హ్యుమన్ తరఫున ఇటీవల సైకిల్ వినియోగంపై అవగాహన కల్పించారు సల్లూభాయ్. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో సైకిల్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను సల్మాన్ వివరించారు. అంతేకాకుండా మితిమీరిన వేగంతో వాహనాలు నడుపవద్దని ఆయన సూచించడంపై సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయింది.

మితిమీరిన వేగం, మద్యం తాగి వాహనాలు నడపటం లాంటివి సల్మాన్ చెబితే బాగుండదు. మీరేనా ఆ విషయాలు చెప్పేది అని పలువురు నెటిజన్లు నిలదీశారు. గతంలో మద్యం సేవించి సల్మాన్ వాహనం నడిపారని సల్మాన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆ ఘటనలో కొందరు గాయపడటంతోపాటు, ఒకరు మరణించిన సంగతి తెలిసిందే. ఇటీవల హిట్ అండ్ రన్ కేసు నుంచి సల్మాన్ బయటపడ్డారు.

English summary
Salman Khan goes on bycycle ride in mumbai. Recently he started campaign about cycle usage for health condition. He has taken bodyguards help for this ride. He has shared his joyful cycle ride video in social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu