»   » చిరు, చరణ్ స్టోరీ ఓకే చేసారు : బోయపాటి ప్రకటన

చిరు, చరణ్ స్టోరీ ఓకే చేసారు : బోయపాటి ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: బాలయ్య హీరోగా ‘లెజెండ్’ చిత్రాన్ని తెరకెక్కించి భారీ విజయం తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను హై ఓల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన మాస్ సినిమాలు తీయడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. తాజాగా బోయపాటి మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. ఆ సినిమా మరెవరితోనో కాదు....మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌‌తో! ఈ విషయాన్ని బోయపాటి స్వయంగా వెల్లడించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ నిర్మించబోతున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్టోరీలైన్ రామ్ చరణ్‌కు చెప్పి వారి నుండి గ్రీన్ సిగ్నల్ పొందిన బోయపాటి ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్టు వర్కులో బిజీగా ఉన్నారు. బోయపాటి మాట్లాడుతూ....‘రామ్ చరణ్‌తో పాటు చిరంజీవిగారికి కూడా స్టోరీలైన్ చెప్పాను. వారికి నచ్చింది. స్ర్కిప్టు వర్కు పూర్తి కావాల్సి ఉంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాను’ అని బోయపాటి శ్రీను వెల్లడించారు. ఈ చిత్రాన్ని మాన్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించేందుకు బోయపాటి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక బోయపాటి దర్శకత్వంలోని లెజెండ్ సినిమా వివరాల్లోకి వెళితే...ఈ నెల 28న విడుదలైన ఈచిత్రం తొలి రోజు నుండే సూపర్ హిట్ టాక్‌తో దూసుకెలుతోంది. తొలి మూడు రోజుల్లో ఊహించిన దానికంటే భారీగానే వసూళ్లు రావడంతో నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు.
హైదరాబాద్: బాలయ్య హీరోగా 'లెజెండ్' చిత్రాన్ని తెరకెక్కించి భారీ విజయం తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను హై ఓల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన మాస్ సినిమాలు తీయడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నాడు. తాజాగా బోయపాటి మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. ఆ సినిమా మరెవరితోనో కాదు....మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌‌తో!

ఈ విషయాన్ని బోయపాటి స్వయంగా వెల్లడించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ నిర్మించబోతున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్టోరీలైన్ రామ్ చరణ్‌కు చెప్పి వారి నుండి గ్రీన్ సిగ్నల్ పొందిన బోయపాటి ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్టు వర్కులో బిజీగా ఉన్నారు.

బోయపాటి మాట్లాడుతూ....'రామ్ చరణ్‌తో పాటు చిరంజీవిగారికి కూడా స్టోరీలైన్ చెప్పాను. వారికి నచ్చింది. స్ర్కిప్టు వర్కు పూర్తి కావాల్సి ఉంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాను' అని బోయపాటి శ్రీను వెల్లడించారు. ఈ చిత్రాన్ని మాన్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించేందుకు బోయపాటి ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇక బోయపాటి దర్శకత్వంలోని లెజెండ్ సినిమా వివరాల్లోకి వెళితే...ఈ నెల 28న విడుదలైన ఈచిత్రం తొలి రోజు నుండే సూపర్ హిట్ టాక్‌తో దూసుకెలుతోంది. తొలి మూడు రోజుల్లో ఊహించిన దానికంటే భారీగానే వసూళ్లు రావడంతో నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు.

English summary
“I have narrated the story line to Charan and Chiranjeevi garu. They liked it. I am now developing it further and I will reveal more details soon”, Director Boyapati Srinu said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu