»   » వర్మ, ఎన్టీఆర్, పూరీ, రాజమౌళిలకు పార్టీ ఇచ్చి...

వర్మ, ఎన్టీఆర్, పూరీ, రాజమౌళిలకు పార్టీ ఇచ్చి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ, రవితేజ, మెహర్ రమేష్, పూరీ జగన్నాధ్, ప్రకాష్ రాజ్, రాజమౌళిలకు బ్రహ్మాజీ రీసెంట్ గా పార్టీ ఇచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో రాజమౌళి ట్వీట్ చేసారు. చాలా ఫన్ గా పార్టీ జరిగింది. బ్రహ్మాజి ఫండ్ ని టైమ్ ని ఖర్చుపెట్టి ఈ పార్టీని ఏర్పాటు చేసాడు. పార్టీ రైట్ ప్లేస్ కాదు కాకపోవచ్చు కానీ...అంతా గెట్ టుగెదర్ లా కలిసి ఫన్ గా గడపటానికి ఇది ఉపకరిస్తుంది..అని ట్వీట్ చేసారు. ఇక ప్రస్తుతం రాజమౌళి...ఈగ స్క్రిప్టు తయారీలో బిజీగా ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ..అప్పలరాజు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పూరీ జగన్నాధ్..నేను నా రాక్షసి, మెహర్ రమేష్...ఎన్టీఆర్ తో శక్తి చేస్తున్నారు. ఇంతకీ వీరందరికీ బ్రహ్మాజీ పార్టీ ఇచ్చిన మోటివ్ ఏమిటన్నది సినీ వర్గాల్లో చర్చగా ఉంది. అలాగే బ్రహ్మాజిని హీరోగా చేసిన కృష్ణవంశీ ఈ పార్టీకి ఎందుకు రాలేదన్నది ఓ హాట్ టాపిక్ గా మారింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu