»   » ఫన్నీ ఫోటో : బ్రహ్మీ...‘క్రేజ్ వీరుడు’

ఫన్నీ ఫోటో : బ్రహ్మీ...‘క్రేజ్ వీరుడు’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బ్రహ్మానందం ఫేసు మార్పింగ్ చేస్తూ పలువురు హీరోలను, ప్రముఖులను, కొత్త సినిమాలను ఆట పట్టించడం గత కొంత కాలంగా సాగుతున్న సంగతి తెలిసిందే. బ్రహ్మానందం కామెడీని ఇష్టపడే కొందరు బ్రహ్మీ పేరుతో, ఫేసుతో పలు పేరడీలు చేస్తూ నెటిజన్లకు వినోదం పంచుతున్నారు.

తాజాగా నాగార్జున హీరోగా రూపొందిన 'గ్రీకు వీరుడు' సినిమాపై 'క్రేజ్ వీరుడు' అనే పేరడీని వదిలారు. ఇప్పుడు ఇది ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది. నాగార్జున, నయనతార జంటగా దశరథ్ దర్శకత్వంలో రూపొందిన గ్రీకు వీరుడు చిత్రం ఈ రోజు విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

అయితే ఇలాంటి చర్యలపై బ్రహ్మానందం కొన్ని నెలల క్రితం స్పందించారు. 'ఫేస్ బుక్ మెంబర్స్‌కి నా అభ్యర్థన... మీరు నామీద ఎన్ని జోకులయినా వేసుకోండి... కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోండి... నాకేం బాధ లేదు... ఎందుకంటే నేను పుట్టిందే మిమ్మల్ని నవ్వించడానికి... కానీ నా పేరు పెట్టుకుని ఇతరులను మాత్రం దయచేసి అవమానించకండి... అది నన్ను తీవ్రంగా బాధిస్తోంది... నేను ఎప్పుడూ అలా కోరుకోను... నా అభ్యర్థనను పెద్ద మనసుతో ఆలకిస్తారని భావిస్తున్నాను' అంటూ పేర్కొన్నారు. అయితే ఆయన అభిమానులు మాత్రం బ్రహ్మీ అభ్యర్థనను పట్టించుకోవడం లేదు.

English summary
Creativity has no bounds. Every time a different look of top hero is out into market, Photo Shop artistic brains bring Brahmanandam into the scene. This is the poster that's doing rounds across all social networking sites. After morphing Brahmanandam photos for movies like 'Shakti', 'Badrinath as Brahminath' and 100% Love as 100% Jaffa, Mahesh's Dookudu, Brahmanandam photograph has again been morphed for Nagarjuna's Greeku Veerudu as Crazy Veerudu.
Please Wait while comments are loading...