twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డింపుల్...అంటూ బ్రహ్మీని ఆడేసుకున్నారు

    By Srikanya
    |

    హైదరాబాద్ :'డింపుల్' ఏ పేరు ఎవరన్నా మగవాళ్లు పెట్టుకుంటారా...ఏమో బ్రహ్మానందానికి పెట్టేసారు..మరి నవ్వించాలంటే ఆ మాత్రం క్యారెక్టర్ పేరు నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కృష్ణ సినిమాలో బాబి, అదుర్స్ లో భట్టు...ఇప్పుడు డింపుల్. ఏం చేసినా బ్రహ్మానందంకే చెల్లు, ఏం చేయించుకున్నా వినాయిక్ కే సొంతం అంటున్నారు అల్లుడు శ్రీను యూనిట్ వాళ్లు. ఆ సినిమాలో బ్రహ్మీ...డింపుల్ పాత్రలో చెలరేగిపోయాడట. దాదాపు నలభై నిముషాల పాట సెకండాఫ్ లో హిలేరియస్ కామెడీ పండిస్తున్నాడని టాక్. బ్రహ్మీ, ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే సన్నివేశాలే సినిమాకు హైలెట్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించిన చిత్రం 'అల్లుడు శీను'. నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు శ్రీనివాస్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. సమంత హీరోయిన్. ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్ర పోషించారు.

    ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ... ''కొన్ని సినిమాలకు డబ్బులు తీసుకొన్నామా, నటించామా, వెళ్లిపోయామా? అని ఉంటుంది. ఇంకొన్ని సినిమాలు మాత్రమే మనసుతో ముడివేసుకుపోతాయి. ఆ సినిమా గురించి మాట్లాడాలనిపిస్తుంది. అనుభవాలు పంచుకోవాలనిపిస్తుంది. 'అల్లుడు శీను' అలాంటి సినిమానే. ధైర్యం, తెలివి, తన మీద తనకు నమ్మకం ఉన్న దర్శకుడు మాత్రమే.. ఇలాంటి కథను తెరపై చూపించగలడు. అంతటి షాక్‌ ఈ కథలో ఉంది. అందుకే తొలిసారి కథ విన్నప్పుడు ఆశ్చర్యపోయా. ఎలా తీస్తాడో అనే అనుమానం వెంటాడింది.

    Brahmanandam as Dimple in Alludu Seenu

    వినాయక్‌ పూర్తి న్యాయం చేశాడు. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ మంచి పేరొస్తుంది. ఆ క్రెడిట్‌ వినాయక్‌కే చెందుతుంది. 'దిల్‌' నుంచి అతనితో ప్రయాణం చేస్తున్నా. ఇందులో మాత్రం కొత్త వినయ్‌ కనిపించాడు. శ్రీనివాస్‌కి ఇదే తొలి సినిమా అని ఎప్పుడూ అనిపించలేదు. ఇప్పుడు స్టార్లయిన చాలామంది తొలి సినిమాల్లో నేను పనిచేశా. తొలి సినిమాకే పాత్రలో ఇంతలా లీనమైన నటుడిని చూళ్లేదు. బెల్లంకొండ సురేష్‌ నాకు మంచి మిత్రుడు. తనకు పేరు తెచ్చే కొడుకు శ్రీనివాస్‌'' అన్నారు.

    వినాయక్‌ చెబుతూ ''ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్‌ పాత్ర కీలకం. మొత్తం అరవై సన్నివేశాలుంటే అందులో నలభై సన్నివేశాల్లో ప్రకాష్‌రాజ్‌ కనిపించాలి. ఆయన తప్ప మరో ప్రత్యామ్నాయం నాకు కనిపించలేదు. అందుకే ఆయన డేట్స్‌ కోసం మూణ్నెళ్లు ఆగాల్సి వచ్చింది. ప్రకాష్‌రాజ్‌ కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ నటించడానికి చాలా ధైర్యం కావాలి. కానీ శ్రీనివాస్‌ చాలా ఈజ్‌తో నటించేశాడు. ఇటీవల సినిమాలోని కొన్ని సన్నివేశాలు కొంతమందికి చూపించాం. వాళ్లంతా చాలా థ్రిల్‌ అనుభవించారు. ప్రేక్షకులలోనూ ఇలాంటి స్పందనే వస్తుందన్న నమ్మకం ఉంద''న్నారు. ఈ నెల 25న 'అల్లుడు శీను' విడుదలకానుంది.

    English summary
    It is learnt that Brahmanandam is having a full length character titled 'Dimple' in VV Vinayak's 25 July release Alludu Seenu. Brahmanandam and Prakash Raj are going to have a together screen presence for at least half of the total runtime.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X