‘హార్ట్ ఎటాక్’లో బ్రహ్మానందం లుక్ ఇదే (ఫోటో)

నితిన్ హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం హార్ట్ ఎటాక్. ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఇటీవల గోవాలో జరుగుతున్న షెడ్యూల్ పూర్తయింది. దీంతో టోటల్ గా షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత పూరి జగన్నాథ్ మాట్లాడుతూ... "గోవాలో జరిగిన షెడ్యూల్ తో టోటల్ గా షూటింగ్ పార్ట్ పూర్తయింది. అతి త్వరలో ఆడియో రిలీజ్ చేసి త్వరలోనే చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం". అన్నారు. ఒంట్లో మూడు వేల కేలరీల శక్తిని కరిగించుకొనేందు కోసం... ఒక గంటపాటు ముద్దు కావాలని అడిగాడు ఓ కుర్రాడు. మరి ఆ అమ్మాయి సమాధానమేమిటో మా చిత్రం చూస్తే తెలుస్తుందంటున్నారు పూరి జగన్నాథ్.
నితిన్ సరసన అదా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, పాటలు : భాస్కరభట్ల, సినిమాటోగ్రఫీ : అమోల్ రాథోడ్, ఎడిటింగ్ : ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, కథ,స్క్రీన్ ప్లే,మాటలు,నిర్మాత,దర్శకత్వం : పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











