»   »  ‘బలుపు’ చిత్రంపై బ్రాహ్మణుల ఫిర్యాదు

‘బలుపు’ చిత్రంపై బ్రాహ్మణుల ఫిర్యాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : 'దేనికైనా రెడీ' చిత్రంలో కొన్ని సీన్లు తమను అవమానించే విధంగా, కించపరిచే విధంగా ఉన్నాయంటూ బ్రాహ్మణ సంఘాలు ఆ మధ్య చేసిన ఆందోళన ఏరేంజికి చేరిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా రవితేజ హీరోగా రూపొందిన 'బలుపు' చిత్రంపై కూడా బ్రాహ్మణులు కన్నెర్ర చేసారు.

ఇటీవల విడదులైన 'బలుపు' ట్రైలర్‌లోని కొన్ని డైలాగులు, సీన్లు తమను కించ పరిచే విధంగా ఉన్నాయని, బ్రాహ్మణులను అవమానించే రీతిలో ఉన్న సన్నివేశాలను తొలగించాలని, ఆ తర్వాతే ఆ చిత్రానికి సర్ట్ఫికెట్‌ను జారీ చేయాలని బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రీజనల్ సెన్సార్‌బోర్డు, ఫిల్మ్ చాంబర్‌కు వేర్వేరుగా ఫిర్యాదు చేసింది.

ఈ మేరకు సమాఖ్య కార్యదర్శి పి.చంద్రశేఖర్, యూత్ విభాగం ప్రెసిడెంట్ ద్రోణంరాజు రవికుమార్‌లు ఇరు సంస్థలకు అందజేసిన ఫిర్యాదు కాపీలను పత్రికలకు విడుదల చేశారు. ఈ చిత్రంలో బ్రాహ్మణులను కించపర్చేవిధంగా ఉన్న కొన్ని సన్నివేశాలు యూట్యూబ్‌లో విడుదల చేసిన ఆ చిత్రం ట్రైలర్స్‌లో ఉన్నాయని వారు తెలిపారు. వీటిని ఇప్పటికే 2,89,095 మంది వీక్షించారని పేర్కొన్నారు.

ఈ చిత్రం విడుదలకు ముందు సర్ట్ఫికెట్ జారీ చేయకుండా బ్రాహ్మణ సంఘాల పెద్దలకు ఒకసారి ఈ చిత్రాన్ని చూపించిన తర్వాతే జారీ చేయాలని, బ్రాహ్మణులను అవమానించే రీతిలో ఉన్న మాటలు, సన్నివేశాలను తొలగించాలని, అటువంటి వాటిని వెంటనే యూట్యూబ్, టివి ట్రైలర్స్‌లో ప్రసారం కాకుండా నిలిపివేసే విధంగా దర్శక, నిర్మాతను ఆదేశించాలని వారు కోరారు. ఈ అంశంపై సరైన చర్య తీసుకునే వరకు చిత్రం విడుదలకు అనుమతివ్వరాదని కోరారు.

English summary
Brahmin community objected Balupu scenes. They are Demanding delete the Controversial scenes. The Brahmin groups have already lodged a complaint with the censor board and film Chanber. The Ravi Teja, Shruti Haasan, Anjali starrer film will be releasing on June 28th.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu