»   »  అసలు ఎక్కడ? మళ్ళీ మారిన 'బ్రహ్మోత్సవం' ఆడియో వేదిక

అసలు ఎక్కడ? మళ్ళీ మారిన 'బ్రహ్మోత్సవం' ఆడియో వేదిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'బ్రహ్మోత్సవం' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపేందుకు, మే 7న హైద్రాబాద్‌లో ఆడియో విడుదలను చేపట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రకటనతో మొదలైన బ్రహ్మోత్సవం సందడి, పీవీపీ టీమ్ చేపడుతోన్న ప్రచారంతో ఊపందుకుంది.

ఈ వేడుక వేదిక విషయంలో మార్పు జరిగినట్టు తాజా సమాచారం. మొదట్లో తిరుపతిలో అడియో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు, మళ్ళీ హైదరాబాలోని శిల్పకళా వేదిక ఆడిటోరియంలో నిర్వహిస్తారంటూ వార్తలొచ్చాయి. కానీ... ఇప్పుడు మళ్ళీ వేదిక మారింది జె.ఆర్.సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆడియో రిలీజ్‌ను చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Brahmotsavam audio launch venue changed again

మహేష్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలల సూపర్ హిట్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో 'బ్రహ్మోత్సవం'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ మంది అభిమానులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇలాంటి పరిస్థితిలో ఇదివరలోనే కొన్ని ఆడియో ఫంక్షన్లలో తొక్కిసలాటల వల్ల జరిగిన చేదు అనుభవాలను దృస్టిలో ఉంచుకోని వేదికను విశాలన్ గా ఉండే విఢంగా జె.ఆర్.సీ కన్వెన్షన్ సెంటర్‌ కి మార్చారని సమాచారం.. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోతో పాటు గా సినిమా థియేటరికల్ ట్రైలర్‌ను కూడా అదే రోజున విడుదల చేయనున్నారు....

English summary
Brahmotsavam Audio Launch Venue is going on changing multiple times. Earlier Shilpa Kala Vedhika is the venue for the event, now the makers have changed it to JRC Convention, Manikonda.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu