»   » బ్రహ్మోత్సవం: ‘బాల త్రిపురమణి’ సాంగ్ మేకింగ్ (వీడియో)

బ్రహ్మోత్సవం: ‘బాల త్రిపురమణి’ సాంగ్ మేకింగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు నటిస్తోన్న 'బ్రహ్మోత్సవం' సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ స్పీడప్ చేసారు. ప్రతి రోజూ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్, ఇతర ఫోటోలు, మేకింగ్ వీడియోలు రిలీజ్ చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేలా చేస్తున్నారు.

ఇటీవల 'వచ్చింది కదా అవకాశం' అనే సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. ఈ సాంగ్ కోసం ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి వేసిన భారీ సెట్టింగ్స్ కలర్ ఫుల్ లుక్ తో అదిరిపోయింది. సినిమాలోని ప్రధాన తారాగణం మొత్తం ఈ సాంగులో ఉన్నారు.తాజాగా మహేష్ బాబు-కాజల్ కాంబినేషన్లో వచ్చే 'బాల త్రిపురమణి' అనే సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. రొమాంటిక్ గా సాగే ఈ సాంగ్ ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు యువతనూ ఆకట్టుకుంటుంది. ఈ సాంగులో మహేష్ బాబు 25 ఏళ్ల కుర్రాడిలా కనిపించడం గమనార్హం. ఈ సాంగును క్రిష్ణ చైతన్య రచించగా... రాహుల్ నంబియార్ పాడారు.


ఈ పాట గురించి సమంత మాట్లాడుతూ... ఈ సాంగ్ నాకు చాలా బాగా నచ్చిన సాంగ్. ఈ సాంగునే కార్లో నేను మల్ల మల్ల మల్ల వింటున్నాను. మహేష్ బాబు బాయ్ లా చాలా అందంగా కనిపించారు అని చెప్పుకొచ్చింది.


ప్రస్తుతం మూవీ టీం అంతా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. మే 20 'బ్రహ్మోత్సవం' చిత్రం విడుదలవుతోంది. సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు సంబంధించిన 'మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్', పివిపి సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వినోదాత్మకంగా నడిచే కుటుంబ కథాచిత్రమిది. ఉమ్మడి కుటుంబంలోని సంతోషాలకు ప్రతిరూపంగా ఈ చిత్రం ఉంటుంది. సత్యరాజ్, జయసుధ, నరేష్, రేవతి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

English summary
Brahmotsavam Movie Songs Making. Bala Tripuramani Song ft. Mahesh Babu, Kajal Aggarwal, Samantha and Pranitha. Directed by Srikanth Addala and music composed by Mickey J Meyer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu