ఫస్ట్ లుక్: డైరెక్టర్ మారుతి అందించిన కథతో 'బ్రాండ్ బాబు'
సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ హీరోహీరోయిన్లుగా పి.ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బ్రాండ్ బాబు'. డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు కథ అందించడంతోపాటు సమర్పిస్తున్నారు. నటుడు మురళి శర్మ ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్, పి.సాయికుమార్ నటిస్తున్నారు.
యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీస్తాడని మారుతికి మంచి పేరుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ రోజుల్లో, భలే భలే మగాడివోయ్ చిత్రాలు మంచి విజయం అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అందించిన కథతో వస్తున్న 'బ్రాండ్ బాబు'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో టీజర్ ను విడుదల చెయ్యబోతున్నారు. జీవన్ బాబు (జే. బి) ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా కార్తీక్ ఫలని సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్ బ్యానర్ పై ఎస్. శైలేంద్ర ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు.
నటీనటులు:
సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ, మురళి శర్మ, పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్, వేణు వై, నలీన్, పి. సాయి కుమార్, కోటేష్ మన్నవ, కిరణ్.
సాంకేతిక నిపుణులు:
స్టోరి: మారుతి
డైరెక్టర్: ప్రభాకర్.పి
నిర్మాత: ఎస్. శైలేంద్ర
బ్యానర్: శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్
మ్యూజిక్: జేబి
లిరిక్స్: పూర్ణచెర్రీ
కెమెరామెన్: కార్తీక్ ఫలణి
ఎడిటర్: ఉద్ధవ్ ఎస్.బి
ఆర్ట్ డైరెక్టర్: మురళి ఎస్.వి
పి ఆర్ ఓ: వంశీశేఖర్


Click it and Unblock the Notifications











