»   » 'బృందావనం' ని ఆ చిత్రంతో పోల్చద్దు...సమంత

'బృందావనం' ని ఆ చిత్రంతో పోల్చద్దు...సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఏం మాయ చేసావె' చిత్రంతో పరిచయమైన సమంతాను మరిచిపోవటం కష్టం. చూస్తూండగానే ఆమె రెండో చిత్రం 'బృందావనం' రిలీజ్ అయిపోయింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... 'ఏం మాయ చేసావె', 'బృందావనం' ..ఈ రెండు సినిమాల్నీ పోల్చి చూడవద్దు. జెస్సీ-ఇందూ రెండూ వేర్వేరు పాత్రలు. అయినా రొమాన్స్‌ అనేది ప్రతి పాత్రలోనూ ఉంటుంది. చీరకట్టులో ఎక్కువగానో, చుడీదార్‌ వేసుకొంటే తక్కువగానో కనిపించదు.

'బృందావనం'లోనూ నేను రొమాంటిక్‌గానే కనిపిస్తాను అలాగే అలాగే ఎన్టీఆర్ గురించి చెప్తూ... ఎన్టీఆర్ ప్రతిభను కొలవటానికి మాటలు చాలవు. అంకితభావం ఉన్న హీరో ఎన్టీఆర్. ఆయన డాన్స్‌ చేస్తుంటే చూడడం ఇష్టం. కానీ ఆయనతో కలిసి డాన్స్‌ చేయడం చాలా కష్టం. అదృష్టం కొద్దీ దీంట్లో నాకు మాస్‌ పాట ఒకటి దక్కింది. తెర మీద నేనెలా చేశానో చూసుకుందామనే కోరిక తీరలేదు. ఎందుకంటే చూపు ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ నుంచి మరలడం లేదు. రిలీజు రోజునే హైదరాబాద్‌లో థియేటర్‌కి వెళ్లాను. అక్కడ ప్రేక్షకుల స్పందన ఎంతో ఆనందాన్నిచ్చింది అంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu