పోకిరి తో తన స్టామినా మరో సారి నిరూపించి దూసుకుపోతున్న పూరీ జగన్నధ్, ప్రభాస్ కాంబినేషన్‌లో తయారవుతున్న 'బుజ్జిగాడు మేడిన్ ఇన్ చెన్నై' మే 9న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. క్రియేటీవ్ కమర్షియల్ బానర్‌పై నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా త్రిష, సంజన అందాల విందు చేయబోతుంటే డాక్టర్ మోహన్ బాబు ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు.ఆడియోను ఈ నెల 18న రిలీజవుతోంది. అంటే మే లో రానున్న పరుగు, కంత్రి లతో బుజ్జిగాడు పోటీ పడబోతున్నాడన్న మాట. దాంతో సమ్మర్ ఈ సెన్సేషన్ సినిమాలతో వేడిక్కబోతోంది.