»   » ‘డిజె’ షూటింగులో నిర్లక్ష్యం: ఇలా అయితే భారీ మూల్యం తప్పదు బన్నీ?

‘డిజె’ షూటింగులో నిర్లక్ష్యం: ఇలా అయితే భారీ మూల్యం తప్పదు బన్నీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దువ్వాడ జగన్నాథమ్' సినిమా సూటింగుకు సంబంధించిన లొకేషన్ నుండి లీకుల సరంపర కొనసాగుతోంది. ఇటీవల సెట్స్ నుండి ఓ ఫోటో లీక్ కాగా... తాజాగా ఏకంగా షూటింగ్ స్పాట్ నుండి బన్నీ డైలాగ్ చెప్పిన సీన్ ఒకటి లీక్ అయింది.

సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎలాంటి వీడియో రిలీజ్ కాలేదు. టీజర్ లాంటివి రాక ముందే లీకు వీరులు ఈ లీక్డ్ సీన్లను యూట్యూబ్ లో పెట్టేసారు. ''ఆ మాటల్ని మీ బాబాయిలకు చెప్పానంటే తక్షణం మీ పెళ్లి ఆగిపోతుంది జాగ్రత్త'' అంటూ బన్నీ డైలాగ్ ఆ లీకైన వీడియోలో ఉంది.

షూటింగ్ స్పాట్లో సరైన చర్యలు లేక పోవడం, నిర్లక్ష్యం వల్లనే ఇలాంటివి లీక్ అవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇది ఇలానే కొనసాగితే భారీ మూల్యం తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు గతంలో ఇలాంటి లీకుల వల్ల నష్టపోయిన వారు.

rn

ఇదే ఆ వీడియో

ఈ వీడియో యూట్యూబులో ఎంత సేపు ఉంటుందో తెలియదు... ఈ లోగా చూసేండి.

మతాచారాల గొడవే.., ఆగ్రహంతో దువ్వాడ జగన్నాథం షూటింగ్ ఆపేసిన స్థానికులు

మతాచారాల గొడవే.., ఆగ్రహంతో దువ్వాడ జగన్నాథం షూటింగ్ ఆపేసిన స్థానికులు

చెన్నకేశవుడంటే విష్ణుమూర్తి రూపాలలో ఒకరు కాబట్టి వైష్ణవ ఆలయంలో శైవాచారానికి సంబంధించిన సెట్లను ఎలా వేస్తారంటూ స్థానికులు అక్కడకు వచ్చి దువ్వాడ జగన్నాథం షూటింగ్‌ను అడ్డుకున్నారు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కొడుకుతో కలిసి బన్నీ లుంగీ అవతార్... తిరుమలలో సందడి (ఫోటోస్)

కొడుకుతో కలిసి బన్నీ లుంగీ అవతార్... తిరుమలలో సందడి (ఫోటోస్)

బన్నీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఓ ఫోటో అభిమానులను తెగ ఒకట్టుకుంటోంది. శ్రీవారి దర్శనం సందర్బంగా బన్నీ, అయాన్ సాంప్రదాయ పంచకట్టు(లుంగీ) అవతారంలో బయల్దేరారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది..ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

వేరీజ్ ద పొడుగుజుట్టు చారీ...? అదిరిపోయిన దువ్వాడ జగన్నాథం ఫస్ట్ లుక్

వేరీజ్ ద పొడుగుజుట్టు చారీ...? అదిరిపోయిన దువ్వాడ జగన్నాథం ఫస్ట్ లుక్

హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా 'దువ్వాడ జగన్నాథం' తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడి పాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Bunny’s Duvvada Jagannadam Dialogue Teaser Leaked. Allu Arjun and Pooja Hegde starrer Duvvada Jagannadam Directed by Harish Shankar and music by Devi Sri Prasad. Produced by Dil Raju on SVC banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu