»   » ధ్రిల్ అయ్యి.... అభిమానులకు ధాంక్స్ చెప్పిన అల్లు అర్జున్, ఎందుకంటే

ధ్రిల్ అయ్యి.... అభిమానులకు ధాంక్స్ చెప్పిన అల్లు అర్జున్, ఎందుకంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ధాంక్స్ చెప్పారు. ఈ విషయాన్ని బన్ని ఫ్యాన్స్ అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకు బన్ని హఠాత్తుగా ధాంక్స్ చెప్పాడు అంటే ఈ కథనం చదవాల్సిందే.

రీసెంట్ గా అల్లు అర్జున్ తాజా చిత్రం 'డీజే దువ్వాడ జగన్నాథమ్' టీజర్‌ విడుదలైంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అభిమానుల కోసంఈ టీజర్‌ విడుదల చేశారు. ఈ టీజర్‌లో అల్లు అర్జున్‌ బ్రాహ్మణుడి గెటప్‌లో సందడి చేస్తున్నారు. బన్నీ డిఫెరెంట్‌ గెటప్ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ఎప్పుడు స్టైలిష్ గా కనిపించే బన్నీ, ఈ సారి సాంప్రదాయబద్ధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేయటంతో చాలా ఆసక్తికరంగా ఉన్నారు. దాంతో ఈ టీజర్ వ్యూస్ కోటి ని రీచ్ అయ్యాయి. ఈ నేపధ్యంలో ఆయన తన అభిమానులకు ధాంక్స్ చెప్పారు.

ముఖ్యంగా టీజర్ లో వచ్చిన 'ఇలా ముద్దు పెట్టెస్తే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని' అంటూ హీరోయిన్‌ ను ఉద్దేశించి బన్నీ పలికిన డైలాగ్‌ తెగ నచ్చేస్తోంది. 'సరైనోడు' బ్లాక్ బ్లస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

డీజే దువ్వాడ జగన్నాథమ్' సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు తన సొంత నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

టీజర్ మంచి ఆదరణ పొందుతోందని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. తమ సంస్థ నుండి సినిమా అంటేనే ప్రేక్షకులలో భారీ అంచనాలు వుంటాయని, అలాగే అల్లు అర్జున్ తమ సంస్థలో చేస్తున్న హ్యాట్రిక్ మూవీగా డి.జె నిలుస్తుందని నిర్మాత తెలిపారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చిందని, అలాగే నేడు విడుదల చేసిన టీజర్‌కు కూడా ప్రేక్షకులనుండి ట్రెమండస్ రెస్పాన్స్ లభించిందని తెలిపారు.

అల్లు అర్జున్‌ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దిల్‌రాజు నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: రవీందర్, సంగీతం: దేవీశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే: దీపక్‌రాజ్, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్‌శంకర్.

English summary
DJ Duvvada Jagannadham' has crossed 10 million views on Youtube. So thrilled by the response, Allu Arun thanked the fans. He tweeted, "I Whole Heartedly Thank you all for over a Crore views . One of the highest in telugu films. Thank you for all the love! (sic)."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu