»   » సంక్రాంతి మనదే బ్రదర్.... బన్నీ ఇంకోసారి వివాదం లో

సంక్రాంతి మనదే బ్రదర్.... బన్నీ ఇంకోసారి వివాదం లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్, వైజాగ్ ఫ్యాన్స్ ఇంటర్వ్యూలో ఈ సంక్రాంతి మనదే బ్రదర్ అని ఖైదీ నంబర్ 150 సినిమాపై తన నమ్మకాన్ని వ్యక్తపరిచాడు సీజ‌న్‌లు ఎన్ని మారినా హ‌వా మాత్రం మెగా హీరోల‌దే. మెగా హీరోలంతా ఇప్పుడున్న ఠఫ్ కాంపిటీష‌న్‌లోనూ త‌మ‌ని తాము సినీవినీలాకాశంలో ఆవిష్క‌రించుకుంటున్నారు. ఈసారి కూడా సీజ‌న్ వీళ్ల‌దే. వ‌రుస‌గా మెగా హీరోలంతా సినిమాల‌తో బిజీ. వ‌రుస విజ‌యాల్ని ఖాతాలో వేసుకుంటూ త‌మదైన శైలిలో దూసుకుపోతున్నారు. వీట‌న్నిటికీ మించి ఈ సంవ‌త్స‌రం మెగా నామ సంవ‌త్స‌రం అని చెప్పుకునేలా మెగాస్టార్ చిరంజీవి త‌న కెరీర్ ల్యాండ్ మార్క్ మూవీ ఖైదీ నంబ‌ర్ 150లో న‌టిస్తున్నారు. కెరీర్ 150వ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. చిరుతో పాటు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ఇలా వరుసగా రానున్నారు....

తాజాగా ఓ సిమెంట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఎంపికయ్యాడు. ఆ సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు మంగళవారం వైజాగ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. అక్కడ తనను కలిసిన కొందరు అభిమానులతో బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా గురించి పరోక్షంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నంబర్ 150 గురించి అడిగిన అభిమానులతో.. 'ఈ సారి సంక్రాంతి మనదే' అని వ్యాఖ్యానించినట్టు టాక్.

Bunny said: ” Eesari Sankranti manade”

ఆ మాట నందమూరి ఫ్యాన్స్‌కి తెలియడంతో.. అంటే బాలకృష్ణ శాతకర్ణి సినిమా కన్నా ఖైదీ నంబర్ 150నే సూపర్ హిట్ అన్న అర్థంలోనే బన్నీ ఆ వ్యాఖ్యలు చేశాడని అనుకుంటున్నారు. దీంతో బన్నీపై నందమూరి అభిమానులు మరింత పదునైన వ్యాఖ్యలను ఎక్కు పెట్టేందుకు సిద్ధమవుతున్నారట. కాగా, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను డైరెక్ట్ చేస్తున్న క్రిష్.. సినిమా ఆడియో ఫంక్షన్ సందర్భంగా 'ఖబడ్దార్' అన్న పదాన్ని వాడాడు. దానిపై అతడు వివరణ ఇచ్చినా.. బన్నీ ఎందుకు ఇలాంటి కామెంట్ చేయాల్సి వచ్చిందని నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారట.

కాగా, అంతకు ముందు కూడా పవన్ కల్యాణ్‌నుద్దేశించి 'చెప్పను బ్రదర్' అని బన్నీ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యతో బన్నీ.. కొంత పవన్ అభిమానుల ఆగ్రహానికి గురైన విషయమూ తెలిసిందే. మరి తాజా కామెంట్ ఎంత వరకు దారితీస్తుందో చూడాలి.

English summary
peaking at a very private get together in Vizag, Bunny in a cheeky voice said: ” Eesari Sankranti manade” clearly hinting at the other festival release Gautamiputra Satakarni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu