For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేశ్ వర్సెస్ అల్లు అర్జున్.. ఆ రోజే తేల్చుకొంటాం.. దానయ్యపై బన్నీవాసు ఫైర్..

  By Rajababu
  |

  టాలీవుడ్‌లో బన్నీ వాసు నిర్మాతగా కంటే అల్లు అర్జున్ స్నేహితుడిగా అందరికీ సుపరిచితుడు. బన్నీవాసు నిర్మాణ సారథ్యంలో రూపొందిస్తున్న చిత్రం నెక్ట్స్ నువ్వే. ఈ చిత్రాన్ని వంశీ, జ్ఞానవేల్‌, అల్లు అరవింద్‌తో కలిసి V4 అనే బ్యానర్‌పై నెక్ట్స్ నువ్వే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆది సాయి కుమార్, యాంకర్ రష్మీ, వైభవి, బ్రహ్మాజీ నటిస్తున్న చిత్రానికి ఈటీవీ ప్రభాకర్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నెక్ట్స్ నువ్వే చిత్రం నవంబర్‌ 3న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా బన్నీ వాసు మీడియాతో ముచ్చటించారు. ఈ చిత్రం గురించి బన్నీ వాసు చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

  హారర్ థ్రిల్లర్ నెక్ట్స్ నువ్వే

  హారర్ థ్రిల్లర్ నెక్ట్స్ నువ్వే

  కడుపుబ్బా నవ్వించే ఓ హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం నెక్ట్స్ నువ్వే. క్లైమాక్స్ సీన్లు కొత్తగా ఉంటాయి. ఆది సాయి కుమార్ నటన అలరిస్తుంది. గతంలో ప్రభాకర్ కథ చెప్పాడు. అది బాగా నచ్చింది. కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు. నా స్నేహితుడు జ్ఞానవేల్‌ సూచన మేరకు ఈ చిత్రాన్ని నిర్మించాం. డైరెక్టర్‌గా రాణిస్తాడనే నమ్మకం ప్రభాకర్‌పై ఉంది. అందుకే ఆయనకు అవకాశం ఇచ్చాం.

  Allu Arjun Next Movie satellite rights bagged by A TV channel For Crores
  ప్రభాకర్‌తో మరో సినిమా

  ప్రభాకర్‌తో మరో సినిమా

  ప్రభాకర్‌పై పెట్టిన నమ్మకం మరింత పెరగడంతో ఆయన గురించి దర్శకుడు మారుతికి చెప్పాను. నా సూచన మేరకు మారుతి నిర్మాతగా ఓ చిత్రం ప్రారంభమైంది. ఒక చిత్రం విడుదల కాకముందే మరో సినిమా ఆఫర్ వచ్చిందంటే నెక్ట్స్ నువ్వే తీసిన విధానం ఏంటో అర్థమవుతున్నది. ప్రభాకర్‌తో మరో చిత్రాన్ని తీయాలనే ఆలోచన ఉంది.

   100 పర్సెంట్ వినోదం

  100 పర్సెంట్ వినోదం

  నెక్ట్స్ నువ్వే చిత్రం ఓ తమిళ సినిమాకు రీమేక్‌. తెలుగు నేటివిటీకి అనుగుణంగా పూర్తిగా మార్పులు చేశాం. నిర్మాతగా ఈ చిత్రాన్ని అంగీకరించడానికి కథలో ఉన్న ఎంటర్‌టైన్‌మెంటే కారణం. టికెట్‌కు పెట్టిన డబ్బుల కంటే ఎక్కువ వినోదం ఉంటుంది. లాజిక్‌లు ఉండవు. కానీ 100 పర్సెంట్ వినోదం ఉంటుంది. పని విషయంలో ఆది చాలా ప్రొఫెషనల్‌. దానికి సక్సెస్‌ తోడైతే మంచి హీరో అవుతాడు. ఆదికి ఆ బ్రేక్‌ ఈ సినిమా ఇస్తుందని నమ్ముతున్నా.

  కొత్త దర్శకుల కోసం V4

  కొత్త దర్శకుల కోసం V4

  కొత్త దర్శకులను పరిచయం చేసేందుకే V4 సంస్థని మొదలెట్టాం. ముగ్గురు కుర్రాళ్లను దర్శకులుగా పరిచయం చేయబోతున్నాం. పెద్ద చిత్రాల్ని గీతా ఆర్ట్స్‌లో, పరిమిత వ్యయంతో కూడిన ఇలాంటి చిత్రాల్ని వీ4 సంస్థలోనూ తీస్తాం. ప్రతిభావంతుల్ని వెలుగులోకి తీసుకురావడానికి మేం ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఆ వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తాం

  పవన్ కల్యాన్ అభిమానిని

  పవన్ కల్యాన్ అభిమానిని

  పవన్‌కల్యాణ్‌ అభిమానిని నేను. ఆయనతో సినిమా చేయాలనుంది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా మేం నిర్మిస్తున్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్టుగానే, ఏప్రిల్‌ 27న విడుదల చేస్తున్నాం. అది ‘ఖుషీ రిలీజ్‌ అయిన తేదీ. మాకు ఓ సెంటిమెంట్ ఉన్నందున అందుకు ముందే ఫిక్స్‌ అయ్యాం. బన్నీ పుట్టిన రోజు ఏప్రిల్ 8 తేది. ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ చేయవచ్చు. కానీ ఖుషీ రిలీజ్ రోజు చేస్తే బాగుంటుంది.

  మహేశ్‌బాబుతో పోటీ పడటం లేదు

  మహేశ్‌బాబుతో పోటీ పడటం లేదు

  మహేశ్‌బాబు, కొరటాల శివ సినిమాకు పోటీగా వెయ్యడం లేదు. ముందు నా పేరు శివ సినిమా రిలీజ్ డేట్‌ను ముందుగా మేము అనౌన్స్ చేశాం. కానీ దానయ్య మమ్మల్ని సంప్రదించకుండా ఆయన ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన ముందు చెప్పి ఉంటే ఆలోచించే వాళ్లం. ఏమీ చెప్పకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఇబ్బంది అనిపించింది. ఇప్పడు చర్చలు జరిపాల్పిన అవసరం లేదనిపిస్తున్నది.

  ఈగ విషయంలో

  ఈగ విషయంలో

  గతంలో రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ చిత్రానికి అల్లు అర్జున్ జులాయి సినిమాకు క్లాష్ వచ్చింది. ఈగ మంచి సినిమా తీశారు అని జులాయి సినిమాను వెనుకకు జరిపాం. ఈగ రిలీజ్ అయిన మూడు వారాల తర్వాత జులాయిని రిలీజ్ చేశాం. పరిశ్రమలో ఆరోగ్య వాతావరణం కావాలని కోరుకొంటాను.

   100 పేజీల పుస్తకం

  100 పేజీల పుస్తకం

  నిర్మాణ విషయంలో నిర్మాత అల్లు అరవింద్‌ సలహాలు తీసుకున్నాం. అల్లు అరవింద్‌ 100 పేజీల పుస్తకం. ఆయన్ని ఓ 15, 20 పేజీలు చదివుంటా. వయసు పెరిగే కొద్దీ తక్కువ వయసున్న వారితో స్నేహం చేస్తుంటారాయన. అనుక్షణం అప్‌డేట్‌ అవ్వడానికి చూస్తుంటారు.

  English summary
  Producer Bunny Vasu's latest movie is Next Nuvve. This film made under banner of V4. ETV Prabhakar is director. Aadi Sai Kumar, Rashmi Gautam, Brahmaji are lead character. This movie slated to release on November 3rd. In this occassion, Bunny Vasu speaks to media. He clarified on Mahesh Babu, Allu Arjun's movie which are clashing on April last week.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X