»   »  చిరకు అనుకున్న కథతోనే సాయి ధరమ్ తేజ? టైటిల్ ఏంటంటే

చిరకు అనుకున్న కథతోనే సాయి ధరమ్ తేజ? టైటిల్ ఏంటంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి, పూరి కాంబినేషన్ లో అప్పట్లో ఆటో జానీ టైటిల్ తో ఓ చిత్రం అనుకున్నారు. చిరంజీవి 150 వ చిత్రంగా దాన్ని ఫైనలైజ్ కావాల్సింది. అయితే సెకండాఫ్ సరిగా రెడీ కాలేదని చిరు దాన్ని రిజెక్ట్ చేసారని చెప్పుకున్నారు. ఆ కథ..రైటర్ బి.వియస్ రవిదే. ఇప్పుడదే కథతో సాయి ధరమ్ తేజని ఒప్పించి, డైరక్షన్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినపడుతోంది.

ఇందులో ఎంత వరకూ నిజముందో కానీ చిరంజీవి ..ఈ కథను వద్దనుకున్నాక, కొద్ది పాటి మార్పులతో దాన్ని సాయి ధరమ్ తేజకు చెప్పారని, అతను వెంటనే ఓకే చేసాడని చెప్పుకుంటున్నారు. కథలో మార్పులు చేసాక అద్బుతంగా వచ్చిందని, ఈ లోగా కత్తి రీమేకే కన్ఫర్మ్ కావటంతో సాయి ధరమ్ తేజ చేస్తున్నడని టాక్.

అలాగే ..ఈ చిత్రానికి జవాన్ అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. అలాగే టైటిల్ కు ట్యాగ్ లైన్ గా ఇంటికొక్కడు అని డిసైడ్ చేసినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ తిక్క చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. ఈ చిత్రం అనంతరం ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాసం ఉంది.

BVS Ravi - Sai Dharam film titled Jawaan!

ఇక ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ లకు సన్నిహితుడైన కృష్ణ ప్రొడ్యూస్ చేయనున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాని సమర్పిస్తారు. ఈ చిత్రం పూర్తి స్దాయి యాక్షన్ థ్రిల్లర్ గా ఉండనుందని చెప్తున్నారు.

సుప్రీమ్ హిట్టయ్యాక..సాయి ధరమ్ తేజ పూర్తి స్దాయి లీడ్ లోకి వచ్చిన హీరో. టాలీవుడ్ స్టార్ హీరోల్లో సాయి కూడా తనకంటూ స్దానం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపధ్యంలో ఆయన చేయబోయే, చేస్తున్న ప్రతీ చిత్రంపై జనాలకు ఆసక్తి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆయన రచయిత ,దర్శకుడు బివియస్ రవి చేయబోతున్న చిత్రం గురించే ఇండస్ట్రీ మాట్లాడుతోంది. ఆ చిత్రం ..గతంలో చిరంజీవితో పూరి అనుకున్న చిత్రమే అంటున్నారు. నిజమో ఉత్తిదో కాని ఆసక్తికరమైన గాసిప్పే కదా.

English summary
Sai Dharam Teja will be staring in BVS Ravi’s new film. This film has been titled as 'Jawaan' with the tagline 'Intikokadu'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu