»   » శ్రీను వైట్ల అంత చీప్‌గా చేస్తున్నారా?

శ్రీను వైట్ల అంత చీప్‌గా చేస్తున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ ఉన్నంత వరకే వారికి మంచి గుర్తింపు, డిమాండ్ ఉంటుంది. వరుసగా రెండు మూడు ప్లాపులు తాకితే ఎంత ఎత్తులో ఉన్న స్టార్ అయినా కొంద పడిపోవాల్సిందే. ఇక డైరెక్టర్ల పరిస్థితి మరీ దారుణం. ప్రస్తుతం దర్శకుడు శ్రీను వైట్ల పరిస్థితి అలానే ఉంది.

ఆగడు ప్లాప్ భారీ నష్టాలను మిగల్చడంతో దర్శకుడు శ్రీను వైట్ల పెద్ద దెబ్బ పడింది. అయితే వెంటనే రామ్ చరణ్ తో ‘బ్రూస్ లీ' సినిమా చేసే అవకాశం రావడంతో గట్టెక్కుతాడని అంతా భావించారు. కానీ ఈ సినిమా పరాజయం శ్రీను వైట్ల కెరీర్ గ్రాఫ్ ను మరంత దెబ్బతీసింది.

ఆయనతో సినిమాలు చేయడానికి ఏ నిర్మాత సాహసించడం లేదు. ఆయన ఫాంలో ఉన్నపుడు సినిమా చేయడానికి మొగ్గు చూపిన స్టార్ హీరోలు ఇపుడు ఆయన్ను పూర్తిగా దూరం పెట్టారు. మొన్నటి వరకు స్టార్ హీరో అయితే తప్ప సినిమా చేయని వైట్ల ఇపుడు కుర్ర హీరోపై దృష్టి సారించాడు.

 C Kalyan Produce Srinu Vaitla Movie

గతంలో తనకు ‘రెడీ' సినిమాతో మంచి హిట్ ఇవ్వడంతో శ్రీను వైట్ల తో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు యువ హీరో రామ్. వైట్ల చెప్పిన కథ కూడా రామ్ కి బాగా నచ్చిందట. రామ్ డేట్స్ తీసుకుని నిర్మాత కోసం వెతుకుతున్న శ్రీను వైట్లకు సి.కళ్యాణ్ నుండి గ్రీన్ సిగ్నల్ లభించిందని సమాచారం.

గతంలో శ్రీను వైట్ల రెమ్యూనరేషన్ భారీగా ఉండేది. ఇపుడు మాత్రం చాలా చీప్ రేటుకే చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం శ్రీను వైట్ల అవకాశం వస్తే చాలు అనుకోవడం తప్పితే రెమ్యూనరేషన్ ఇంత ఇవ్వాలని డిమాండ్ చేసే పరిస్థితి లేదు. తక్కువ బడ్జెట్లో రామ్ తో సినిమా చేసి మంచి ప్రాఫిట్స్ తెచ్చి పెడితే మరో సినిమా అవకాశం ఇస్తానని, అప్పుడు రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తానని చెప్పాడట సి.కళ్యాణ్.

English summary
C Kalyan, the producer of Puri Jagannadh’s upcoming film Loafer, announced that he will be producing Sreenu Vaitla’s next film. The senior producer also said that the film is in its early stages and that he will reveal more details in the coming few days.
Please Wait while comments are loading...