twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలంగాణ ‘ఇంకెన్నాళ్లు’ పాటలపై సినారె కామెంట్స్

    By Bojja Kumar
    |

    తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇంకెన్నాళ్లు". ఈ చిత్రానికి ప్రముఖ కవి, సినీగేయ రచయిత డాక్టర్ సి. నారాయణరెడ్డి( సినారె) 'ఏమి వెలుతురు" అనే పాటను రాశారు. ఈ విషయమై సినారె మీడియాతో మాట్లాడుతూ....'చిత్ర దర్శకుడు రఫీ చెప్పిన సన్నివేశం నచ్చి వెంటనే పాట రాయడానికి అంగీకరించాను. సన్నివేశం, సందర్భం నచ్చితేనే నేను పాట రాయడానికి అంగీకరిస్తాను. ఏ సినిమా విషయంలోనైనా మొదటి నుంచి ఈ నియమానికి కట్టుబడే గీత రచన చేస్తాను. 'ఇంకెన్నాళ్లు" చిత్రంలో కథానుగుణంగా పెళ్లి నేపథ్యంలో ఓ అద్భుతమైన పాట రాసే అవకాశం లభించింది" అన్నారు

    'అత్తవారింట అడుగుపెట్టే పెళ్లికూతురు మనోభావాల్ని ఈ పాటలో పొందుపరిచాను. ఈ చిత్రంలో రఫీ స్వరపరిచిన పాటలన్నీ విన్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఘటనల్ని ఆధారం చేసుకొని ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ పాటలన్నీ అందరినీ ఆకట్టుకునేలా రూపొందాయి. తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను చాటిచెపుతూ 'ఇంకెన్నాళ్లు" టైటిల్ అర్థవంతంగా వుంది" అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు రఫీ మాట్లాడుతూ ఈ రోజు నాకల సాకారమైంది. సి.నారాయణ రెడ్డిగారి పాటను స్వరపరిచే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

    English summary
    Inkennallu movie on telangana movement. This movie directed by rafi and Lyrics written by C Narayana Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X