»   » "అ ఆ" ని ఆపుతారా ఆగిపోతారా?: ఈ ఇద్దరుకుర్రాళ్ళ ప్రభావం త్రివిక్రమ్ మీద పడనుందా?

"అ ఆ" ని ఆపుతారా ఆగిపోతారా?: ఈ ఇద్దరుకుర్రాళ్ళ ప్రభావం త్రివిక్రమ్ మీద పడనుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడున్న సినిమాల్లో బ్రహ్మోత్సవం పక్కకు తప్పుకున్నాక ఇక "అ ఆ" ఊహించిన దానికన్నా మంచి హిట్ నే సాధించ్ఘింది. మంచి వసూళ్ళని కూడా రాబడుతోంది.వారం గడిచిందో లేదో 35 కోట్ల షేర్ తో సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతోంది త్రివిక్రమ్ సినిమా. ఏ పోటీ లేక పోవటం కూడా అ..ఆ కి కలిసి వచ్చిన అంశం.

అయితే ఈ వారం లో "అ ఆ" కి కాస్త బ్రేక్ పడేటట్టే ఉంది. ఎందుకంటే ఈ వారమే ఇద్దరు యువ హీరోల సినిమాలు రానున్నాయి. ఈ సినిమాల్లో ఏ ఒక్కటి మంచి టాక్ సొంతం చేసుకున్నా త్రివిక్రం బిజినెస్ కి ఆటంకం ఏర్పడుతుంది. ఇక రెండూ గనక నిలబడ్దాయీ అంటే అ ఆ కి బ్రేక్ పడ్దట్టే.... ఆ ఇద్దరు కుర్ర హీరోలూ ఏవరూ అంటే....

sundeep trivikram

ఒక్క అమ్మాయి తప్ప హీరో సందీప్ కిషన్ కెరీర్ గత కొన్నాళ్ళు గా ఏమాత్రం ఆశాజనకం గాలేదు. పోయిన సంవత్సరం వచ్చిన "టైగర్" మరీ చెప్పుకో విధంగా ఆడలేదు అంతకుముందు కూడా వరుసగా ఫ్లాపులే తిన్నాడు. ఇప్పుడు సందీప్ కి ఉన్న ఒకే ఒక ఆశ "ఒక్క అమ్మాయి తప్ప".

ఈ సినిమా కోసం పారితోషకం కూడా తీసుకోకుండా నటించాడతను. సినిమా హిట్టయితేనే అతడికి రెమ్యూనరేషన్ అందుతుంది. ఇక దీని దర్శకుడు రాజసింహా.. ఆరేడేళ్లుగా ఇదే కథను నమ్ముకుని ఉన్నాడు. మెగా ఫోన్ పడితే ఈ సినిమాతోనే పట్టాలని. ఎందరు ఈ కథను తిరస్కరించినా పట్టు వదలకుండా చివరికి తాను అనుకున్నది సాధించాడు. అతను అంతగా నమ్మిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

ఇక "తూనీగ తూనీగ" లాంటి ఫ్లాప్ మూవీతో పరిచయమై ఆ తర్వాత "అంతకుముందు ఆ తరువాత" తో కాస్త పరవాలేదు అనిపించుకున్న సుమంత్ అశ్విన్ కూడా ఆపై వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు అతడి ఆశలన్నీ "రైట్ రైట్" మీదే. మంచి కథ తో వస్తున్న ఈ సినిమా మంచి ఫక్లితాన్నే ఇస్తుందన్న నమ్మకం తో ఉన్నారు యూనిట్.ఈ సినిమాతో మను అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. మరి అతను తొలి ప్రయత్నంలో ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి.

ఇక ఈ రెండు సిన్మాలూ...ఇద్దరు కుర్రాళ్ళూ త్రివిక్రమ్ లాంటి దిగ్గజాన్ని డీకొడతారా లేదంటే చతికిల పడతారో చూడాలి. అయితే సందీప్ కిషన్ "ఒక అమ్మాయి తప్ప" కి మంచి టాకే వస్తోంది ఈ సినిమా ఖచ్చితంగా నిలదొక్కుకుంటుందనే అంటున్నారు....

English summary
Sundeep kishan "Oka Ammaayitappa" and sumant aswin's Right right movies are releasing this week, can these tow boys can compete with Trivikram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu