»   » ఈ ఫొటోలో ఉన్న హీరోని గుర్తు పట్టగలరా..???

ఈ ఫొటోలో ఉన్న హీరోని గుర్తు పట్టగలరా..???

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇక్కడ ఉన్న ఫొటోలో వెంకటేష్ తో పాటూ కనిపిస్త్తున్న ఈ ఇద్దరు పిల్లల్లో బ్లాక్ టీషర్ట్ లో స్రవంతీ రవి కిషోర్ తో కనిపిస్తున్న బాలున్ని గుర్తు పట్టగలరా? నువ్వు నాకు నచ్చావ్ సినిమా సమయం లో చెన్నై లోని ఎంజీఎం బీచ్ లో షూటింగ్ జరుగుతున్న సమయం లోదీ ఫొటో. చాలా మంది గుర్తు పట్టక పోవచ్చు గానీ అక్కడ అల్లరి గా కనిపిస్తూ అందగా ఉన్న ఆపిల్లోడు ఎవరో కాదు

తెలుగు ఇండస్ట్రీలో 'దేవదాసు' సినిమాతో యంగ్ ఎనర్జిటిక్ హీరోగా పరిచయం అయిన రామ్ ప్రముఖ నిర్మాత "స్రవంతి" రవికిషోర్ తమ్ముడైన మురళి పోతినేని కొడుకు. హైదరాబాద్ లో పుట్టినా తన విద్యాభ్యాసం తమిళనాడులో చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమం మరియు సెంట్ జాన్ పాఠశాలలో చేసాడు. రామ్ దేవదాసు సినిమా తీసేటప్పటికి చాలా చిన్న వయసు, అంతే కాదు మనోడు మంచి డ్యాన్స్ పర్ఫామెన్స్ తో అందరి చేత మెప్పు పొందాడు.

 Can You Guess The Young Hero In Black Shirt

ఎనర్జిటిక్ స్టార్ రామ్ అంటేనే అదో రకమైన పాజిటివ్ ఎనర్జి వస్తుంది. దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ సినిమాతోనే తనలోని సత్తా చాటుకున్నాడు. యువ రక్తంతో ఉర్రూతలూగించే రామ్ యాక్టింగ్, డ్యాన్సుల్లో సెపరేట్ స్టైల్ మెయింటైన్ చేస్తాడు. దేవదాసు సినిమా తర్వాత సుకుమార్ జగడం సినిమాతో ఫ్లాప్ అందుకున్నా రామ్ కెరియర్ లో మోస్ట్ స్టైలిష్ సినిమా జగడం అని ఇప్పటికి చెబుతారు.

రామ్ తండ్రి గారు మురళి మోహన్ పోతినేని.. బడా ప్రొడ్యూసర్ స్రవంతి రవికిశోర్ రామ్ కు పెదనాన్న అవుతారు. అందుకే రామ్ కు సపోర్ట్ గా స్రవంతి సంస్థ తన సినిమాలను నిర్మిస్తూ వచ్చింది. ఆ బ్యానర్ కు ఉన్న వాల్యూతో రామ్ ను హీరోగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు స్రవంతి రవికిశోర్. ఇక రామ్ మూడో సినిమా రెడీ..

శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన రెడీ కామెడీతో కడుపుబ్బా నవ్వించింది. ఆ సినిమాతో కెరియర్ లో ఓ సూపర్ హిట్ అందుకున్నాడు రామ్. అదే దారిలో మస్కా సినిమా చేసినా అది యావరేజ్ గానే మిగిలింది. ఇక ఆ తర్వాత చేసిన గణేష్, రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలు కాస్త నిరాశ పరిచినా తర్వాత తర్వాత తనదంటూ ఒక మార్క్ తో నిలదొక్కుకున్నాడు...

English summary
Can you guess the hero in Black Shirt sharing Laughs with our own Victory venkatesh during the Shoot of ‘Nuvvu Naku Nachavu’ at MGM Beach, Chennai.Yes Most of you guessed it rite Thats Energetic Star – Ram
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu