twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో నగల దోపిడీ

    By Bojja Kumar
    |

    Cannes
    ఫ్రాన్స్ : కాన్స్‌లో జరుగుతున్న ప్రఖ్యాత 66 ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారీ దోపిడీ జరిగింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై నడిచే సినీ తారలు ధరించడం కోసం చిత్రోత్సవ కమిటీ తయారు చేయించిన నగలను దొంగలు దోచుకెళ్లారు. 'ది బ్లింగ్ రింగ్' సినిమా ప్రదర్శన రోజే ఈ దోపిడీ జరుగడం అందరినీ షాక్‌కు గురి చేసింది.

    ప్రతి ఏటా కాన్స్ ఫిల్మ్ ఫెస్ట్‌లో రెడ్ కార్పెట్‌పై నడిచే తారల కోసం నిర్వాహక కమిటీ కొన్ని ఆభరణాలను తయారు చేయిస్తుంది. వేడుకలు పూర్తయిన తర్వాత ఆ ఆభరణాలు తిరిగి కమిటీకి ఇచ్చేస్తుంటారు. గతంలోలానే ఈ సారి కూడా భారీగా నగలను తయారు చేయించారు.

    గత కొన్నేళ్లుగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నగలను స్పానర్స్ చేస్తున్న 'చోపర్డ్' అనే సంస్థనే ఈ సారి కూడా ప్రత్యేకమైన ఆభరణాలను తయారు చేయించింది. వాటిని స్టార్స్ విడిది చేసే ఓ స్టార్ హోటల్‌లో భరద్ర పరిచారు. వీటిపై కన్నేసిన దొంగలు పథకం ప్రకారం వాటిని దోచుకెళ్లారు. వాటి విలువ రూ. 6 కోట్లపైనే ఉంటుందని అంటున్నారు.

    'ది బ్లింగ్ రింగ్' అనే చిత్రం కాన్స్ ఫిల్మ్ పెస్ట్‌లో ప్రదర్శితం అయిన రోజే ఈ దోపిడీ జరుగడం చర్చనీయాంశం అయింది. ఇంతకీ ఈ చిత్రానికి, నగల దోపికీడీ సంబంధం ఏమిటంటే..... సినీ ప్రముఖులు, ఇతర ప్రముఖులు రెడ్ కార్పెట్ వేడుకలకు వెళ్లినపుడు వారి ఇళ్లలోకి చొరబడి దోపిడీ చేసే ఓ గ్యాంగ్ ఇతివృత్తంతో 'ది బ్లింగ్ రింగ్' చిత్రం రూపొందించారు.

    ఈ చిత్రం ప్రదర్శన పూర్తయి చిత్రం చాలా బాగా తీసారని అంతా చప్పట్లు కొట్టి ఒ వైపు అభినందిస్తుంటే...అదే సమయంలో ఈ దోపిడీ వార్త వినిపించడంతో అతా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ నగల దోపిడీ వ్యవహారంపై ఫ్రాన్స్ పోలీసులు విచారణ జరుపసుతున్నారు.

    English summary
    It sounds, ironically, like something out of a movie: $1 million worth of Chopard jewelry has been stolen at the Cannes Film Festival.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X