»   » హైకోర్టులో రామ్ చరణ్ కి రిలీఫ్

హైకోర్టులో రామ్ చరణ్ కి రిలీఫ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజులకు రాష్ట్ర హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది. గతంలో రామ్ చరణ్ నటించిన 'ఎవడు' చిత్ర యూనిట్‌పై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ చిత్రం పోస్టర్లు అశ్లీలంగా ఉన్నాయంటూ మాజీ కౌన్సిలర్ నాగేందర్ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 292 సెక్షన్ కింద రామ్ చరణ్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులపై కేసు నమోదు చేసారు. ఇప్పుడా కేసుని నిలిపివేయమని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కేసుని పూర్తిగా కొట్టివేయాలని దిల్ రాజు, రామ్ చరణ్ దాఖలు చేసిన పిటీషన్లను జస్టిస్ కేజీ శంకర్ సోమవారం విచారించి కొట్టివేశారు.

రామ్ చరణ్ ప్రస్తుత సినిమాలు విషయం...

Case against Ram Charan Teja film crew stayed


రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' . కాజల్‌ హీరోయిన్. శ్రీకాంత్‌, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రధారులు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఈ చిత్రాన్ని అక్టోబర్ 1 వ తేదిన విడుదల చేయ్యాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించుకున్నారని సమాచారం. శ్రీకాంత్‌, కమలినీ ముఖర్జీ ఇతర ముఖ్య పాత్రధారులు. ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ మార్పు కొత్తగా వచ్చింది. ఇంతకు ముందు ఈ పాత్రకు గానూ రాజ్ కిరణ్ ని అనుకున్నారు.

అలాగే త్వరలో రామ్ చరణ్...చారిత్రిక ప్రాధాన్యత ఉన్న అద్పుతమైన శ్రీకృష్ణ దేవరాయుల పాత్రలో కనిపించనున్నారా అంటే అవుననే వినపడుతోంది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఈ మేరకు త్వరలో సైన్ చేయనున్నాడని, ఇప్పటికే ఈ చారిత్రిక కథకు సంభందించిన కథను విన్నాడని చెప్తున్నారు. అశుతోష్ గోవార్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని చెప్తున్నారు. ఆంధ్ర,కర్ణాటకల చెందిన శ్రీకృష్ణదేవరాయుల చరిత్ర...విజయనగర మహా సామ్రాజ్యం నేపధ్యంలో ఓ మహాకావ్యంగా తీయాలని ఎప్పటినుంచో అశుతోష్ కలలు కంటున్నారట.

ఎప్పుడైతే ఆయన మగధీర చిత్రాన్ని చూడటం సంభంవించిందో అప్పుడే రామ్ చరణ్ తో అటువంటి పాత్రను చేయించాలని ఉత్సాహం కలిగించని అంటున్నారు. దాంతో ఈ ప్రాజెక్టు విషయం చిరంజీవికి చెప్పటం జరిగిందని, ఆయన కూడా గో ఎ హెడ్ అన్నారని అంటున్నారు. రామ్ చరణ్ ..జంజీర్ చిత్రం ఫ్లాఫ్ అయినా అక్కడ బాగా పాపులర్ హీరో అవటం ఈ కొత్త ప్రాజెక్టుకి కలిసి వచ్చే అంశం. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో అనుకున్న ప్రాజెక్టు పూర్తి కాగానే ఈ చిత్రానికి సంభందించిన పనిలో పడతారని అంటున్నారు.

English summary
Justice K.G. Shankar of the High Court stayed criminal cases against the crew and cast of Ram Charan Teja starrer Telugu film Yevadu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu