»   » పెళ్లి చేసుకుని మోసం చేసాడంటూ కమెడియన్ ఫృధ్వీపై పోలీస్ కేసు

పెళ్లి చేసుకుని మోసం చేసాడంటూ కమెడియన్ ఫృధ్వీపై పోలీస్ కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో స్టార్ కమిడయన్ గా వెలుగుతున్న పృథ్విపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పృథ్వి తనను వివాహం చేసుకుని మోసం చేశాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది.

బాధితురాలి ఫిర్యాదుపై 498ఏ, 420 సెక్షన్ల కింద బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప్రస్తుతం బిజీ క‌మెడియ‌న్‌గా వెలుగొందుతున్నపృథ్వీ 30 ఇయర్ ఇండస్ట్రీ డైలాగ్‌తో సూప‌ర్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇండ‌స్ట్రీ తొలి ద‌శ‌లో ప‌లు ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ హాస్యనటుడు ప్రస్తుతం చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.

Prudhvi

ఈ మధ్యకాలంలో బ్రహ్మనందం తర్వత అంతాలా క్రేజ్ తెచ్చుకున్న నటుడు పృద్వి. మెన్నటి లౌక్యం నుండి రీసెంట్ గా వచ్చిన జక్కన్న వరకూ వైవిధ్యమైన స్పూఫ్ లతో ఆకట్టుకున్నారు. ప్రభాస్ బహుబలి సినిమాను దాదాపు నాలుగు సినిమాలలో స్ఫూఫ్ గా చేయగా ...శ్రీమంతుడు కూడా అదే స్థాయిలో స్పూఫ్ లకు ఎగబాకింది. కాకపోతే ఇందులో విశేషం ఎమిటంటే, ఈ సినిమాల స్పుఫ్ లలో ఎక్కువగా నటించి మెప్పించింది మాత్రం ధర్టి ఇయిర్స్ ఇండస్ట్రీ పృద్వియే కావటం విశేషం. బాహుబలి లో శివలింగాన్ని ఎత్తిన సీన్ ను అనుకరించడంలో తనకు సాటి ఎవరు లేగని నిరుపించిన ఫృధ్వి.... భలే మంచి రోజు సినిమాలో కూడా పోలీస్ సినిమాల్లో డైలాగులు వరస పెట్టి చెప్పాడు.

అంతేకాదు... మహేష్ శ్రీమంతుడు సునిమాలో డైలాగ్స్ అచ్చంగా దించి ఆడియన్స్ చేత ఈలలు వేయించాడు దియోటర్స్ లో. శంకరాభరణం సినిమాలో కూడా శ్రీమంతుడు డైలాగు చెప్పి విజిల్స్ వేయించాడు. సౌఖ్యం సినిమాలో అయితే పూర్తిగా స్ఫూఫ్ ల మీదే నడిపే ప్రయత్నం చేసారు. ఇదే రీతిలో సప్తగిరి, షకలక శంకర్ కూడా వారి స్థాయిలో స్ఫూఫ్ లు చేసి వారు మెప్పించారు.

English summary
A case was registered against noted comedian Prudhvi (30 years industry). A woman has complained with the Banjara Hills police station that Prudhvi had married her and cheated her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu