»   » హీరో వేణు,ఆయన భార్యపై...డాక్టర్ పోలీస్ కంప్లైంట్

హీరో వేణు,ఆయన భార్యపై...డాక్టర్ పోలీస్ కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అప్పట్లో కుటుంబ కధా చిత్రాలు వెండి తెరను ఏలిన రోజుల్లో బిజీగా ఉన్న తొట్టింపూడి వేణు.. ఆ మధ్యన ఎన్టీఆర్ దమ్ము చిత్రంలో కనపడ్డారు. ఆ తర్వాత మళ్లీ గాయిబ్. మళ్ళీ ఇన్నాళ్లకు వార్తల్లోకి వచ్చారు. అయితే ఈ సారి ఆయనపై ఓ డాక్టర్ కేసు విషయంలో వార్తల్లోకి ఎక్కారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ బేగంపేటలో ఫౌతేమి డాక్టర్ గా చేస్తున్నారు. ఏడు నెలల క్రితం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 రెసిడెన్సీలో వేణు కి చెందిన ఫ్లాట్ నెంబర్ 302 లో అద్దెకు తీసుకున్నారు ఆమె. ఫ్లాట్ అద్దె 29, 300. మూడు నెలలు అడ్వాన్స్ క్రింద ఎనభై ఎనిమిది వేలు చెల్లించారు. అయితే ఇప్పుడు ఆమె ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిందామె. అయితే తను ఇచ్చిన అడ్వాన్స్ ని తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు ఆ డాక్టర్.

Case filed against actor Venu Thottempudi

అయితే ఇందుకు వేణు, ఆయన భార్య అడ్వాన్స్ తిరిగి ఇవ్వటానికి ఒప్పుకోలేదు. ఫ్లోర్ పై క్రాక్స్ వచ్చాయి. దాన్ని సరిచేసి ఇస్తేనే అడ్వాన్స్ తిరిగి ఇస్తామని చెప్పినట్లు ఆ ఇరాని డాక్టర్ తన కంప్లైంట్ లో తెలిపింది. వేణు, ఆయన భార్య అనుపమ చౌదరిలపై ఆ కంప్లైంట్ పెట్టారు.

అయితే ఈ వివాదాన్ని ఇక్కడితో పుల్ స్టాఫ్ పెట్టాలని భావించిన వేణు..పౌతౌమీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే నిజంగా ఫ్లోర్ బీటలు తీస్తే...వేణు కు ఆమె దాన్ని బాగుచేయించి ఇచ్చి అడ్వాన్స్ పట్టుకెళ్లాలి. సెలబ్రెటీ కదా అని కంప్లైంట్ పెట్టి వసూలు చేసుకోవాలనుకోవటం సమంజసం కాదు.

English summary
A case has been filed against actor Venu Thottempudi and his wife by a irani doctor, who supposed to be his ex-tenant.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu