»   » అభిమాని చేసిన పని: తమిళ టాప్ హీరోపై కేసు నమోదు

అభిమాని చేసిన పని: తమిళ టాప్ హీరోపై కేసు నమోదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అభిమానం ఉండొచ్చు, దాన్ని ప్రదర్షించటానికి హద్దులూ ఉంటాయని మర్చి పోకూడదు. అత్యుత్సాహం తో ఆలోచన లేకుండా చేసే పనులు ఆఖరికి ఎవర్నైతే అభిమానిస్తున్నామో వారినే ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి వస్తే..! వస్తే కాదు వచ్చింది. తన ఫేవరెట్ హీరో మీద తన ప్రేమను చూపించబోయి చిక్కుల్లో పడేసాడు ఓ అభిమాని.

తమిళ హీరో విజయ్‌కి వీరాభిమాని అయిన ఒక యువకుడు త్రిశూలం పట్టుకు న్నట్టు విజయ్‌ ఫోటోని రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్‌ కావడంతో అందరి దృష్టిలో ఫోటోపైకి మళ్లింది. అయితే ఫోటోలో విజయ్‌ షూస్‌ ధరించి ఉండడంపై హిందూ మక్కల్‌ మున్నని పార్టీ అభ్యంతరం తెలిపింది.

Case Filed Against Tamil Star Vijay

షూస్‌ ధరించి త్రిశూలం చేతపట్టడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొంటూ విజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇక ఇప్పుడు విజయ్ కి తలపట్టుకోవటం ఒకటే తక్కువ. అసలు తన ప్రమేయం లేకుండా జరిగిన విషయానికి తనని భాద్యున్ని చేసిన అభిమానినీ ఏమీ అనలేక, ఇటు తననూ సమర్థించుకోలేక పిచ్చెక్కిపోతున్నాడట. పాపం

English summary
Hindu Makkal Munani has lodged a complaint against Ilayathalpathy Vijay with the Chennai City Police Commissioner that he had hurt Hindu sentiments
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu