»   » 150వ సినిమా: చిరుతో కలిసి ఆడిపాడనున్న ఎమ్మెల్యే

150వ సినిమా: చిరుతో కలిసి ఆడిపాడనున్న ఎమ్మెల్యే

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా చేస్తున్నానని ప్రకటించిన దగ్గర నుంచి రోజుకో వార్త ఫిలిం నగర్ వర్గాల్లో సందడి చేస్తోంది. ఈ సినియాకు పనిచేయబోయే సాంకేతిక నిపుణుల నుంచి నటీనటుల వరకు రకరకాల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార లేదా అనుష్క నటించనున్నారే వార్త అప్పట్లో హల్ చల్ చేసింది.

అయితే ఇప్పటికీ హీరోయిన్ల విషయంలో క్లారిటీ రాలేదు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ పేరు ఖరారు కాకపోయినప్పటికీ, ఐటం సాంగ్‌లో ఆడిపాడేందుకు మరో కుర్ర హీరోయిన్‌ను ఎంపిక చేశారని తెలుస్తోంది. సరైనోడు సినిమాలో మెగా హీరో అల్లు అర్జున్ సరసన గ్లామరస్ ఎమ్మెల్యేగా నటించిన కేథరిన్ థెరిస్సా, మెగాస్టార్ 150వ సినిమాలో ఐటం సాంగ్ చేయనుందట.

అంతేకాదు ఈ సినిమాలోని కీలక సన్నివేశాల్లో కూడా ఈ అమ్మడు కనిపించనుందని సమాచారం. కోలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మెగాస్టార్ సరసన ఐటం సాంగ్‌లో నటించే అవకాశం కొట్టేయడం కేథరిన్‌కు ఇది గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు.

catherin theresa special song in chiranjeevi 150th movie

150వ సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ ఖరారయిన తర్వాత హీరోయిన్ ఎవరనే విషయమై ఓ క్లారిటీ వస్తుంది. తమిళంలో సూపర్ హిట్టయిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేస్తున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మార్పులు, చేర్పులు చేసారు.

చిరంజీవి కెరీర్లో ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ఈ సినిమా కోసం రామ్ చరణ్ నిర్మాత అవతారం ఎత్తాడు. 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ' స్థాపించారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాలో పాత్రకు తగిన విధంగా సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆయన బరువు తగ్గేందుకు నిపుణుల సమక్షంలో కసరత్తులు చేస్తున్నారు. జూన్ నెలలో సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

English summary
catherin theresa special song in chiranjeevi 150th movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu