»   » అదేంటీ తమన్నాని ఎందుకు తప్పించారు? చిరు 150 లో కేథరిన్..!??

అదేంటీ తమన్నాని ఎందుకు తప్పించారు? చిరు 150 లో కేథరిన్..!??

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరుపుకుంటోంది. చిరు పక్కన హీరోయిన్ గా కాజల్ నటిస్తుండగా చిరు మళ్ళీ ఒకప్పటి మెరుపులు మెరిపించటానికి సిద్దం ఔతున్నాడు.ఈ సినిమాకి హీరోయిన్ ని వెతకటం కోసమే నానా తంటాలు పడిన డైరెక్టర్, విలన్ కోసం కూడా అంతే కష్టపడ్డాడు. చివరికి ఇద్దరూ సెట్ అయ్యారు. ఒకప్పుడు చిరు సరసన హీరోయిన్ గా చేసిన అంజలా ఝవేరీ భర్త తరుణ్‌ అరోరా ఓకే అయ్యాడు. ఇక ఇప్పుడు ఐటెం గాళ్‌‌ను వెతికే పనిలో కూడా... చాలా పేర్లే వినపడ్దాయి.

చాలా గ్యాప్ తరువాత చిరు సినిమా వస్తుండటంతో మంచి స్టోరితో పాటు మసాలా లాంటి అదిరిపోయే ఐటెం సాంగ్‌‌ను పెట్టబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సాంగ్‌కు ఎవరు సూటవుతారని సెర్చింగ్ మొదలెట్టిన దర్శకుడు ఆఖరికి సరైనోడు చిత్రంలో యంగ్ ఎమ్మెల్యేగా నటించిన కేథరిన్‌‌ను ఫైనల్ చేసేశాడట. అయితే ఈ సాంగ్ లో మొన్నటి వరకూ మిల్కీ బ్యూటీ తమన్నా పేరు వినిపించింది... మళ్ళీ ఇప్పుడేమో కేథరిన్ అంటున్నారు... అసలే ఇదివరకే తమన్నాతో చేయాలనుందంటూ వేదిక మీదే కోరిక వెలిబుచ్చాడు చిరు. ఇంతకీ తమనా నే తప్పుకుందా..? తప్పించారా..?? అదంతా పక్కకు పెడితే కేథరిన్ మాత్రం పిచ్చ హాపీగా ఉందట....

తెగ సంతోషపడుతోందట

తెగ సంతోషపడుతోందట

చిరుతో స్టెప్పులేసే అవకాశం రావడంతో కేథరిన్ తెగ సంతోషపడుతోందట. ఇక ఆమె ఆనందానికి హద్దులేవ్.

సరైనోడు తో సుడి తిరిగినట్టే

సరైనోడు తో సుడి తిరిగినట్టే

`సరైనోడు`లో అల్లు అర్జున్ సరసన నటించి ఓ ఊపు ఊపేసిన ఆమె తెలుగు చిత్ర పరిశ్రమ దృష్టిని ప్రముఖంగా ఆకర్షించింది. దాంతో ఆమెకి తెలుగు నుంచి అవకాశాలు వెల్లువెత్తడం మొదలైంది. అయితే ఇటీవల మరోసారి మెగా కాంపౌండ్ నుంచే ఆమెకి అదిరిపోయే ఆఫర్ లభించినట్టు ప్రచారం సాగుతోంది.

మూడు అల్లు అర్జున్ తోనే

మూడు అల్లు అర్జున్ తోనే

అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో మూడు సినిమాలు చేసే అవకాశం కొట్టేసింది కేథరిన్. తొలి సినిమా ‘ఇద్దరమ్మాయిలతో' ఫ్లాపైనా.. రెండో సినిమా ‘రుద్రమదేవి' అంతగా పేరు తెచ్చిపెట్టకపోయినా.. ‘సరైనోడు'లో నటించే అవకాశం పట్టేసింది.

ఈమె కోసమే స్పెషల్ గా

ఈమె కోసమే స్పెషల్ గా

అందులో నిజమెంతో తెలియదు కానీ... కేథరిన్ చిరు సినిమాలో ఐటెమ్ పాట చేయబోతోందట. కేథరిన్ పై ప్రేమతో ఆమెని ఐటెమ్ కే పరిమితం చేయకుండా కొన్ని సన్నివేశాల్ని కూడా సృష్టించారని పరిశ్రమ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి.

తమన్నానే అనుకున్నా

తమన్నానే అనుకున్నా

మొదట చిరుతో కలిసి స్పెషల్ సాంగ్ లో ఆడిపాడే ముద్దుగుమ్మ తమన్నానే అని ప్రచారం సాగింది. చిత్ర బృందం కూడా ఆమెని సంప్రదించినట్టు వార్తలొచ్చాయి.

తమన్నా బిజీ అట

తమన్నా బిజీ అట

కానీ ప్రస్తుతం తమన్నా బిజీగా ఉండడం వలన ఈ స్పెషల్ సాంగ్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోంది. దీంతో కేథరిన్ థ్రెసాను ఈ పాట కోసం ఎంపిక చేసినట్లు సమాచారం.

దేవీ శ్రీ ప్రసాద్

దేవీ శ్రీ ప్రసాద్

ఈ పాటకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మంచి బీట్ తో మాస్ ట్యూన్ ను చేస్తున్నాడు. అలాగే చిరంజీవి తన డ్యాన్సుల సత్తాను మరోసారి ఈ పాటలో చూపించనున్నారట.

చిరంజీవి డాన్స్ హైలేట్

చిరంజీవి డాన్స్ హైలేట్

ఈ పాటలో చిరంజీవి తన గత చిత్రాల మాదిరిగా అదిరిపోయే స్టెప్పులేస్తున్నాడు. ఈ పాటే సినిమాకు హైలైట్ కానుందని తెలిసింది.

షూటింగ్ హైదరాబాద్ లోనే

షూటింగ్ హైదరాబాద్ లోనే

వీవీ వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో కొనసాగుతోంది. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే!

ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు

ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు

చిరు సరసన నటించే అవకాశం రావడంతో అమ్మడికి సుడితిరిగినట్లేనంటూ టాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ ఐటెం సాంగ్‌‌పై డైరెక్టర్ ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు.!

English summary
Finally The beautiful girl Catherine Tresa got the opportunity to shake a leg with megastar in khidi no.150
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu