»   » 48 కట్స్: సెన్సార్ బోర్డ్ రికార్డ్....ఆ సినిమా పరిస్థితి ఏంటి?

48 కట్స్: సెన్సార్ బోర్డ్ రికార్డ్....ఆ సినిమా పరిస్థితి ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇండియన్ సెన్సార్ బోర్డు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఓ సినిమా విషయంలో భారీగా కట్స్ సూచించడం హాట్ టాపిక్ అయింది. ఈ మధ్య కొన్ని సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు వ్యవహారం వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ మూవీ 'బాబూ‌మోషాయ్ బందూక్‌బాజ్' విషయంలో సెన్సార్ బోర్డు తీరు వివాదాస్పదం అయింది. ఈ చిత్రానికి 48 చోట్ల సీన్లు కట్ చేయాలని ఆదేశించారు. దీంతో షాకైన చిత్ర దర్శక నిర్మాతలు రివైజింగ్ కమిటీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టే

అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టే

సినిమాకు ఇన్ని కట్స్ సూచించడంపై మీడియా వారు సెన్సార్ బోర్డ్ చీఫ్ నిహ్లానీని ప్రశ్నించగా.. ‘నా పని నేను చేస్తున్నా' అని చెప్పి వెళ్లిపోయారట. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి కాబట్టే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పకనే చెప్పారు.

ఏమాత్రం బెదరని నిహ్లానీ

ఏమాత్రం బెదరని నిహ్లానీ

సెన్సార్ బోర్డ్ చీఫ్ పదవి నుండి నిహ్లానిని తొలగించాలని కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీ పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నాయకుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. అయినప్పటికీ నిహ్లానీ ఏమాత్రం బెదరడం లేదు. అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే నిర్దాక్షిణ్యంగా కోసేస్తున్నారు.

బాబూమోషాయ్ బందూక్‌బాజ్

బాబూమోషాయ్ బందూక్‌బాజ్

యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘బాబూమోషాయ్ బందూక్‌బాజ్' మూవీకి కుషన్ నందీ దర్శకత్వం వహిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా నటిస్తుండగా అతడికి జోడీగా బెంగాలీ నటి బిదితా బాగ్‌ నటించింది. సినిమాలో తొలుత నవాజ్‌కి జోడీగా చిత్రాంగద సింగ్‌ను తీసుకున్నారు. కానీ ఇందులో అభ్యంతకర సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో ఆమె సినిమా నుంచి తప్పుకొన్నారు.

సెక్స్ సీన్లు, హింస

సెక్స్ సీన్లు, హింస

ఇప్పటికే విడుదలైన ‘బాబూమోషాయ్ బందూక్‌బాజ్' ట్రైలర్ పరిశీలిస్తే సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు బాగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. సెక్స్, హింస సీన్లను ప్రొజెక్ట్ చేస్తూ ఈ ట్రైలర్ కట్ చేశారు. ఆ ట్రైలర్ చూసినపుడే సెన్సార్ ఇబ్బందులు తప్పవని అంతా భావించారు. ఇపుడు అనుకున్నట్లే జరిగింది.

సెన్సార్ బోర్డుపై విమర్శలు

సెన్సార్ బోర్డ్ తీరుపై పలువురు సినీ ప్రముఖులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్ బోర్డు మోరల్ పోలిసింగ్ చేస్తోందని.... ముద్దు సీన్లు, లవ్ మేకింగ్ సీన్లకు కూడా కత్తెర పెట్టడం సబబు కాదని అంటున్నారు.

English summary
Bollywood upcoming movie ‘Babumoshai Bandookbaaz‘ went for CBFC certification and the Censor Board suggested 48 cuts leaving the makers of the movie in astonishment. The number itself is shocking and what would be left out of the film, if the makers remove the suggested 48 cuts? So, the makers may go for a revision hoping for a fewer number of cuts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu