»   » ఊపేసిన అఖిల్, చార్మి ముద్దు, సన్నీ లియోన్ హల్‌చల్ (ఫోటోలు)

ఊపేసిన అఖిల్, చార్మి ముద్దు, సన్నీ లియోన్ హల్‌చల్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు : సినిమా, క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్-4 ఇటీవల ప్రారంభమైంది. టాలీవుడ్ తరుపు నుండి బరిలోకి దిగిన 'తెలుగు వారియర్స్' జట్టు జనవరి 26న బెంగుళూరులో తొలి మ్యాచ్ ఆడింది. కేరళ స్ట్రైకర్స్‌తో పోటీ పడిన మన జట్టు......4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన తెలుగు వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల 142 పరుగుల భారీ స్కోరు చేసింది. వెంకటేష్, తారకరత్న ఓపెనర్లుగా బరిలోకి దిగారు. తారకరత్న (20), ప్రిన్స్ (20), అఖిల్ (22), ఆదర్శ్ (38), సుదీర్ బాబు (26) పరుగులతో రాణించారు.

అయితే అనంతరం బరిలోకి దిగిన కేరళ స్టైకర్స్ జట్టు...20 ఓవర్లలో 143 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా, ఉత్సాహంగా సాగింది. సినీ తారల సందడితో ఎంతో కోలాహలంగా ఈ మ్యాచ్ సాగింది. సన్నీ లియెన్, చార్మి, ప్రియమణి, చీర్ లీడర్స్ తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

స్లైడ్ షోలో ఫోటోల...

తెలుగు వారియర్స్

తెలుగు వారియర్స్


తెలుగు వారియర్స్ జట్టు సభ్యులు. తెలుగు వారియర్స్ నిర్ణిత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. 143 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ స్ట్రైకర్స్ ఆరు వికెట్ల నష్టానికి 143 పరులుగు సాదించింది.

అఖిల్

అఖిల్


అక్కినేని అఖిల్ బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగినప్పుడు స్టేడియం చప్పట్లతో మార్మోగింది.

అఖిల్ ఫీల్డింగ్

అఖిల్ ఫీల్డింగ్


బ్యాటింగులో మాత్రమే కాదు...ఫీల్డింగులోనూ ఇరగదీసాడు అఖిల్ అక్కినేని.

ప్రియమణికి చార్మి ముద్దు

ప్రియమణికి చార్మి ముద్దు


మ్యాచ్ సందర్భంగా హీరోయిన్లంతా ఎంతో ఉత్సాహంగా, స్నేహపూరితంగా గడిపారు. అందుకు ఈ ముద్దు దృశ్యమే నిదర్శనం.

చీర్ గాళ్స్

చీర్ గాళ్స్


ఓ వైపు సినీ తారల గ్లామర్ తో పాటు....చీర్ గాళ్స్ గ్లామర్ కూడా మైదానంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సూచనలు

సూచనలు


అఖిల్ అక్కినేనికి ఆటకు సంబంధించిన సూచనలు ఇస్తున్న చాముడేశ్వరి నాథ్. పక్కనే నిర్మాత సురేష్ బాబు.

సన్నీ లియోన్

సన్నీ లియోన్


సచిన్ జోషికి సంబంధించిన XXX డ్రింక్ ప్రమోషన్లో భాగంగా సన్నీ లియోన్ ఈ మ్యాచ్‌లో XXX లోగోలతో కూడిన టీషర్టులు దరించి హల్ చల్ చేసింది.

వెంకీ, అఖిల్, సచిన్

వెంకీ, అఖిల్, సచిన్


తెలుగు వారియర్స్ జట్టు కెప్టెన్ విక్టరీ వెంకటేష్, వైస్ కెప్టెన్ అఖిల్ అక్కినేని, జట్టు సభ్యుడు సచిన్ జోషి.

టాస్..

టాస్..


ఇరు జట్ల మధ్య టాస్ వేస్తున్న దృశ్యం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

సన్నీ లియోన్, చార్మి

సన్నీ లియోన్, చార్మి


ఇండో కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్, చార్మి మ్యాచ్ సందర్భంగా ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

భర్తతో సన్నీ లియోన్

భర్తతో సన్నీ లియోన్


తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి సన్నీ లియోన్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

మ్యాచ్ చిత్రీకరిస్తూ...

మ్యాచ్ చిత్రీకరిస్తూ...


తన యాపిల్ ఐ ఫోన్లో మ్యాచ్ చిత్రీకరిస్తూ సన్నీ లియోన్ ఇలా....

సుమ, చార్మి

సుమ, చార్మి


యాంకర్ సుమ....ఇక్కడ కూడా మైకు అందుకుని తన టాలెంటు ప్రదర్శించింది. ఆమెకు హీరోయిన్ చార్మి కూడా తోడైంది.

టాలీవుడ్ జట్టు..

టాలీవుడ్ జట్టు..


మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకిస్తున్న తెలుగు వారియర్స్ జట్టు సభ్యులు.

 ప్రియమణి, తరుణ్

ప్రియమణి, తరుణ్


మ్యాచ్‌ను తిలకిస్తూ....హీరో తరుణ్, ప్రియమణి

సన్నీ లియోన్, ప్రియమణి

సన్నీ లియోన్, ప్రియమణి


ఫోర్న్ తార సన్నీ లియోన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పలువురు స్టార్లు పోటీ పడ్డారు. ప్రియమణి కూడా ఇలా...

భావన సంతోషం...

భావన సంతోషం...


తమ జట్టు విజయం సాధించడంతో హీరోయిన్ భామన ఇలా ఆనందంతో కేరితలు కొట్టింది.

English summary
The fourth year of CCL - Celebrity Cricket League has already kicked off. As we all were aware, the first match of Kerala Strikers happened yesterday, 26th of January at Chinnaswamy Stadium, Bangalore. They played against Telugu Warriors, and won by 4 wickets against their opponents.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu