Just In
- 12 min ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 2 hrs ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
Don't Miss!
- News
ఇంగితజ్ఞానం ఉన్నవాళ్లు ఆ పనిచేయరు... దమ్ముంటే కేసీఆర్ దానిపై ప్రకటన చేయాలి : సంజయ్ సవాల్
- Finance
Gold prices today: రూ.49,000 స్థాయికి బంగారం ధరలు, వెండి స్వల్పంగా అప్
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాలచందర్‌కు ప్రముఖుల అంతిమ వీడ్కోలు (ఫోటోలు)
చెన్నై: అనారోగ్యంతో మరణించిన ప్రముఖ దర్శకుడు బాలచందర్ భౌతిక కాయాన్ని పలవురు సినీ ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. బాలచందర్ మరణంతో శోక సముద్రంలో మునిగి పోయిన ఆయన కుటుంబ సభ్యులను సినీ నటులు రజనీకాంత్, రాధిక, శరత్ కుమార్ తదితరులు ఓదార్చారు.
బాలచందర్ శిష్యుడు, సన్నిహితుడు కమల్ హాసన్‌కు....ఆయన చివరి చూపు దక్కే అవకాశం కనిపించడం లేదు. ఈ రోజు మధ్యాహ్నం బాలచందర్ అంత్యక్రియలు జరుగనున్నాయి. 'ఉత్తమ్ విలన్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనిపై కమల్ లాస్ ఏంజెల్స్ లో ఉన్నారు. బాలచందర్ మరణ వార్త తెలియగానే బుధవారం ఉదయం అమెరికా నుండి బయల్దేరారు. బుధవారం రాత్రికి ఆయన చెన్నై చేరుకోనున్నారు. నేరుగా బాలచందర్ కుటుంబ సభ్యులను కలిసి వారిని పరామర్శించనున్నారు.
స్లైడ్ షోలో ఫోటోలు....

రజనీకాంత్
తన గురువు బాలచందర్ భౌతిక కాయం వద్ద నివాళులు అర్పిస్తున్న రజనీకాంత్. బాలచందర్ వల్లనే రజనీకాంత్ నటుడిగా పరిచయం అయ్యారు.

కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ...
దుఖ:సాగరంలో మునిగి పోయిన బాలచందర్ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న రజనీ.

రాధిక
బాలచందర్ భౌతిక కాయం వద్ద నివాళులు అర్పిస్తున్న నటి రాధిక.

శరత్ కుమార్
బాలచందర్ పార్థివ దేహం వద్ద తమిళ నటుడు శరత్ కుమార్.

విజయ్
కె బాలచందర్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న హీరో విజయ్.

కుటుంబ సభ్యులు ఓదార్పు
పలువురు ప్రముఖులు బాలచందర్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఎందరికో లైఫ్
బాలచందర్ దర్శకుడిగా ఎందరో కొత్త వారికి లైఫ్ ఇచ్చారు. ఆయన ద్వారా పరిచయమైన వారంతా ఇపుడు పెద్ద స్టార్స్ అయ్యారు.

తమిళ రాజకీయ ప్రముఖులు
పలువురు తమిళ రాజకీయ ప్రముఖులు కె.బాలచందర్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

అకస్మాత్తుగా...
బాలచందర్ ఆసుపత్రిలో చేరినప్పుడు కాస్త ఫర్వాలేదు అనే విధంగా ఆయన ఆరోగ్యం ఉంది. అయితే అకస్మాత్తుగా ఆయన మరణించడం అందరినీ విషాదంలో ముంచెత్తింది.

తిరిగిరాని లోకాలకు...
బాలచందర్ తిరిగి రాని లోకాలకు వెళ్లి పోవడం సౌత్ సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు వ్యాఖ్యానించారు.

కడచూపు కోసం...
బాలచందర్ కడసారి చూపు కోసం ఆయన భౌతిక కాయాన్ని సందర్శించడానికి వచ్చారు.

మృదు స్వభావి
బాలచందర్ చాలా మృదు స్వభావి. అందరితో కలివిడిగా ఉండటం ఆయనకు అలవాటు అని పలువురు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

మంచి మనిషి
బాలచందర్ ఎంతో మంచి మనిషి అని, తన వల్ల అయ్యే సహాయం తప్పకుండా చేసే వారని ప్రముఖులు గుర్తు చేసుకున్నారు.

రోల్ మోడల్
బాలచందర్ ఎందరో దర్శకులకు, నటులకు రోల్ మోడల్ లాంటి వారు.

రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా
బాలచందర్ తొలుత రచయితగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆతర్వాత దర్శకుడిగా మారారు. నిర్మాతగా సినిమాలు నిర్మించారు. కొన్ని చిత్రాల్లో నటించారు.

మహిళా ప్రధానమైన సినిమాలు
బాలచందర్ తీసిన చిత్రాల్లో ఎక్కువగా సామాజిక అంశాలను స్పృషించే సినిమాలు, మహిళా ప్రధానమైన సినిమాలు ఉన్నాయి.

యదార్థ సంఘటనలు
యదార్థ సంఘటనలకు దగ్గరగా బాలచందర్ సినిమాలు ఉండేవి.

అంతిమయాత్ర
బాలచందర్ అంతిమ యాత్రలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.