»   »  చిరంజీవి 150వ సినిమాపై సెలబ్రిటీల ట్వీట్లు ఇలా (ఫోటోఫీచర్)

చిరంజీవి 150వ సినిమాపై సెలబ్రిటీల ట్వీట్లు ఇలా (ఫోటోఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ సినిమా ఓ కొలిక్కి వచ్చింది. ఈ చిత్రానికి దర్శకుడిగా పూరి జగన్నాథ్ ఖరారయ్యాడు. ఈ విషయాన్ని పూరి జగన్నాథ్ తో పాటు, ఈ చిత్రాన్ని నిర్మించబోయే రామ్ చరణ్ కూడా ఖరారు చేసారు. ఈ చిత్రానికి బివిఎస్ రవి కథ అందిస్తున్నారు.

చిరంజీవి‌తో ప్రతిష్టాత్మక 150వ సినిమా చేయబోతున్న పూరి జగన్నాథ్ కు టాలీవుడ్ సెలబ్రిటీల నుండి శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి హీరోగా చివరి సినిమా వచ్చి చాలా కాలమైంది. దాదాపు 8 సంవత్సరాలు గడిచి పోయింది. ఇన్నేళ్ల వెయిటింగుకు ఎట్టకేలకు 2015 సంవత్సరంలో తెర పడుతుండటంపై అభిమానులు ఆనందంగా ఉన్నారు.

చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడు ఖరారైన తర్వాత టాలీవుడ్లో ఇతర సెలబ్రిటీల స్పందన ఎలా ఉందని, ఎవరు ఏయే ట్వీట్లు చేసారనే విషయమై

స్లైడ్ షోలో ఓ లుక్కేద్దాం...

రవితేజ

రవితేజ


పూరి జగన్నాథ్ కు కంగ్రాజ్యులేషన్స్ చెప్పిన రవితేజ....చిరంజీవిని మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీద చూడటం కోసం వెయింటింగ్ అంటూ ట్వీట్ చేసారు.

రవితేజ

రవితేజ


పూరి జగన్నాథ్ కు కంగ్రాజ్యులేషన్స్ చెప్పిన రవితేజ....చిరంజీవిని మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీద చూడటం కోసం వెయింటింగ్ అంటూ ట్వీట్ చేసారు.

పూరి జగన్నాథ్

పూరి జగన్నాథ్


‘ఒకప్పుడు చిరంజీవి సినిమాకి థియేటర్ దగ్గర డెకరేషన్లు చేసేవాడికి ఏం తెలుసు ఏదో ఒకరోజు వాడే ఆయన 150వ సినిమా డైరెక్ట్ చేస్తాడని. ప్లీజ్ నన్ను దీవించండి' అంటూ పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా తన మనసులోని మాటను బయట పెట్టారు.

వరుణ్ తేజ్

వరుణ్ తేజ్


ఇప్పటి వరకు ఒక లెక్క...ఇపుటి నుండి ఒక లెక్క....అంటూ చిరంజీవి 150వ సినిమాను ఉద్దేశించి వరుణ్ తేజ్ ట్వీట్ చేసారు.

కోన వెంకట్

కోన వెంకట్


కోన వెంకట్ పూరి జగన్నాథ్ కి కంగ్రాట్స్ చెప్పడంతో పాటు...రచయిత బివిఎస్ రవిని జాగ్రత్తగా ముందుకు సాగాలని సూచించారు. స్టోరీ కూడా ఎగ్జైటింగుగా, ఎమోషనల్ గా ఉండాలి కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేసారు.

అల్లు శిరీష్

అల్లు శిరీష్


వెల్ కం బ్యాక్ బాస్...వెయింట్ ఫర్ యూ... అంటూ అల్లు శిరీష్ ట్వీట్ చేసారు.

బివిఎస్ రవి

బివిఎస్ రవి


మెగాస్టార్ అంగీకారం తెలపడం సూపర్ ఎగ్జైటెడ్, హైలీ ఎమోషనల్. పూరి జగన్నాథ్ మై మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్. రామ్ చరణ్ నిర్మిస్తుండటం మరో విశేషం అంటూ బివిఎస్ రవి ట్వీట్ చేసారు.

రామ్ చరణ్

రామ్ చరణ్


‘అవును నిజమే. మొత్తానికి డాడీ డిసైడ్ అయ్యారు. మెగాస్టార్ 150వ సినిమాకు దర్శకత్వం వహించబోయేది పూరి జగన్నాథ్. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది' అంటూ రామ్ చరణ్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

నిఖిల్ సిద్ధార్థ్

నిఖిల్ సిద్ధార్థ్


చాలా సంతోషకరమైన వార్త. చిరంజీవి 150 సినిమా రాబోతోంది. చాలా ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేసారు.

వెన్నెల కిషోర్

వెన్నెల కిషోర్


సాధారణంగా మండే చాలా డల్ గా ఉంటుంది. కానీ చిరంజీవి 150వ సినిమా వార్త వినగానే ఈ రోజు మంచి జోష్ ఉంది అంటూ ట్వీట్ చేసారు.

English summary
As soon as Ram Charan confirmed the news about Chiranjeevi's 150, along with mega fans, celebrities were also overwhelmed to hear the big news. Ram Charan officially announced it that Puri Jagannadh will helm the prestigious Chiranjeevi 150.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu